ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచింది. 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. బాలీవుడ్ బాద్‌షా, కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ సందడి చేస్తూ డ్యాన్స్ వేశారు. ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తూ.. జట్టులో జోష్‌ను నింపారు. తమ ప్లేయర్లు బ్యాట్, బంతులతో చెలరేగినప్పుడు లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇక మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి ఇరు జట్ల ఆటగాళ్లతో సరదగా కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో కలిసి డ్యాన్స్ వేశారు. తన సూపర్ హిట్ సినిమా పఠాన్ 'ఝూమ్ జో పఠాన్' సాంగ్ స్టెప్పులను కోహ్లీకి నేర్పించారు. విరాట్ కూడా షారుక్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
-
This happened after the Clash Of The Titans 💪🏻 a 🫂 is a must after such high-voltage matches 🫶🏻
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) April 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
How endearing it is to see King Khan @iamsrk teaching the steps of #JhoomeJoPathaan to King Kohli @imVkohli 📸 🕺🏻🕺🏻#KKRvsRCB #ShahRukhKhan #KKR #AmiKKR #RCB #ViratKohli pic.twitter.com/DiHCgb5nbU
">This happened after the Clash Of The Titans 💪🏻 a 🫂 is a must after such high-voltage matches 🫶🏻
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) April 6, 2023
How endearing it is to see King Khan @iamsrk teaching the steps of #JhoomeJoPathaan to King Kohli @imVkohli 📸 🕺🏻🕺🏻#KKRvsRCB #ShahRukhKhan #KKR #AmiKKR #RCB #ViratKohli pic.twitter.com/DiHCgb5nbUThis happened after the Clash Of The Titans 💪🏻 a 🫂 is a must after such high-voltage matches 🫶🏻
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) April 6, 2023
How endearing it is to see King Khan @iamsrk teaching the steps of #JhoomeJoPathaan to King Kohli @imVkohli 📸 🕺🏻🕺🏻#KKRvsRCB #ShahRukhKhan #KKR #AmiKKR #RCB #ViratKohli pic.twitter.com/DiHCgb5nbU
ఆర్సీబీ చెత్త రికార్డు.. ఈ మ్యాచ్‌లో భారీ పరుగుల తేడాతో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. దిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ఓ చెత్త రికార్డును సమం చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 125 స్కోరులోపే ఆలౌట్ అయిన టీమ్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ, దిల్లీ ఇప్పటివరకు చెరో 15 సార్లు 125 స్కోరులోపే వెనుదిరిగాయి. ఈ రెండు టీమ్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్(11) కేకేఆర్, ముంబయి ఇండియన్స్(9), పంజాబ్(8) సార్లు 125 స్కోరు లోపు ఆలౌట్ అయ్యాయి.
సునీల్ నరైన్ డెలివరీకి కోహ్లీ ఫ్యూజులు ఔట్.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ తన తొలి మ్యాచ్‌లో అదరగొట్టగా.. కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 21 పరుగులు మాత్రమే చేశాడు. కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్.. కోహ్లీని బోల్తా కొట్టించాడు. నరైన్ ఆఫ్‌బ్రేక్ బంతిని.. విరాట్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బాల్ అనూహ్యంగా టర్న్ అయి వికెట్లను గిరాటేసింది. అది చూసిన కోహ్లి షాకైపోయాడు. ఈ వీడియోను కూడా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ సునీల్ నరైన్‌కు 150వది కావడం విశేషం.
-
ICYMI - TWO outstanding deliveries. Two massive wickets.
— IndianPremierLeague (@IPL) April 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on.
Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW
">ICYMI - TWO outstanding deliveries. Two massive wickets.
— IndianPremierLeague (@IPL) April 6, 2023
Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on.
Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWWICYMI - TWO outstanding deliveries. Two massive wickets.
— IndianPremierLeague (@IPL) April 6, 2023
Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on.
Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW
రోహిత్ రికార్డ్ బ్రేక్.. ఈ మ్యాచ్‌లో ఇంకో చెత్త రికార్డు కూడా నమోదైంది. కేకేఆర్ బ్యాటర్ మన్ దీప్ సింగ్.. రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్‌ల చెత్త రికార్డును అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా రోహిత్ శర్మ 223 మ్యాచుల్లో 14 సార్లు డకౌట్ అవ్వగా.. డీకే 209 మ్యాచుల్లో 14 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక తాజా మ్యాచులో విల్లీ బౌలింగ్‌లో డకౌట్ అయిన మన్ దీప్ సింగ్.. ఓవరాల్‌గా 97 ఇన్నింగ్స్‌లో 15 సార్లు డకౌట్ అయ్యాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: KKR VS RCB: శార్దూల్ బాదేయగా.. స్పిన్నర్లు తిప్పేయగా.. మ్యాచ్ ఫొటోస్ చూశారా?