ETV Bharat / sports

IPL 2023 RCB VS PBKS : పంజాబ్​ను చిత్తు చేసిన సిరాజ్​.. ఆర్సీబీ విజయం - siraj bowling punjab match 4 wickets

ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో​ ఆర్సీబీ విజయం సాధించింది. సిరాజ్​ తన అద్భుతమైన బౌలింగ్​తో పంజాబ్​ జట్టును చిత్తు చేశాడు.

Royal Challengers Bangalore won the match
పంజాబ్​పై ఆర్సీబీ విజయం
author img

By

Published : Apr 20, 2023, 7:08 PM IST

Updated : Apr 20, 2023, 7:28 PM IST

చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. తాజా పోరులో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చింది. అటు బ్యాటింగ్​లో ఇటు బౌలింగ్​లో బాగా రాణించింది. బ్యాటింగ్​లో కోహ్లీ, డుప్లెసిస్​ ధనాధన్ ఇన్నింగ్స్​.. బౌలింగ్​లో మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ బౌలింగ్​తో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత కెప్టెన్సీ అందుకున్న విరాట్ కోహ్లీ.. ఇది మంచి విజయం.

175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ కింగ్స్.. 18.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (46; 30 బంతుల్లో 3x4, 4x6), జితేశ్ శర్మ (41; 27 బంతుల్లో 2x4, 3x6) రాణించిన ఫలితం దక్కలేదు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్​ నాలుగు వికెట్లతో మెరవగా.. వసిందు హసరంగ 2, పార్నెల్​, హర్షల్​ పటేల్​ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (59; 47 బంతుల్లో 5x4, 1x6), డు ప్లెసిస్‌ (84; 56 బంతుల్లో 5x4, 5x6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మ్యాక్స్‌వెల్ (0) డకౌట్​గా వెనుదిరిగాడు. దినేశ్ కార్తిక్‌ (7) మళ్లీ విఫలమయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ (7*), షాబాజ్‌ అహ్మద్‌ (5*) నాటౌట్‌గా నిలిచారు.

విరాట్​, డు ప్లెసిస్‌ తొలుత దూకుడుగా ఆడటం వల్ల 11 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 98/0. దీంతో ఆర్సీబీ స్కోరు 200 ప్లస్​ అవుతుందని అభిమానులు ఆశించారు. అయితే, తర్వాత పంజాబ్‌ బౌలర్లు కాస్త పుంజుకోవడం వల్ల స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. ఫస్ట్​ వికెట్‌కు కోహ్లీ, డు ప్లెసిస్‌ ద్వయం 137 పరుగులు నమోదు చేశారు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన 17 ఓవర్‌లో ఫస్ట్ బాల్​కు విరాట్ కోహ్లీ (59), తర్వాతి బాల్​కు మ్యాక్స్‌వెల్ (0) డకౌట్​ అయ్యారు. కోహ్లీ.. వికెట్ కీపర్‌ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అవ్వగా.. మ్యాక్స్‌వెల్ అథర్వ తైడేకు చిక్కి పెవిలియన్​ చేరాడు. ఇక నాథన్‌ ఎల్లిస్‌ వేసిన 18 ఓవర్‌లో డు ప్లెసిస్‌ లాంగాఫ్‌లో ఆడి.. సామ్‌ కరన్‌ చేతికి చిక్కాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19 ఓవర్‌లో దినేశ్‌ కార్తిక్‌ అథర్వ తైడేకు క్యాచ్‌ ఇచ్చి ఔట్​ అయ్యాడు. దీంతో ఆర్సీబీ అనుకున్న దానికన్నా తక్కువ స్కోరుకే 174 పరుగులకు తమ ఇన్నింగ్స్‌ను క్లోజ్ చేసింది. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2 వికెట్లు పడగొట్టాడు. నాథన్‌ ఎల్లిస్‌, అర్ష్‌దీప్‌ సింగ్ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: ఏంది దినేశ్​ కార్తిక్​.. టీమ్​లో ఎందుకున్నావో మర్చిపోయావా?

Last Updated : Apr 20, 2023, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.