ఐండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచులో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (64*; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిసి ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ (37; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోహిత్ శర్మ (28; 18 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ఇషాన్ కిషన్ (38; 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బాగానే రాణించాడు. టిమ్ డేవిడ్ (16) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్ రెండు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.
నాలుగో ఆటగాడిగా.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓ ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్లో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హిట్‌మ్యాన్ ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో అభిమానులు అతడికి అభినందనలు తెలుపుతున్నారు. రోహిత్ శర్మకు ఈ ఫీట్‌ను అందుకోవడానికి 226 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. హిట్ మ్యాన్ కన్నా ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 186 ఇన్నింగ్స్‌లలో, శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్‌లలో, డేవిడ్ వార్నర్ 165 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించారు.
ఇక కోహ్లీ 6844 పరుగులతో(228 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ 210 మ్యాచ్‌ల్లో 6477 పరుగులు చేసి రెండో స్థానంలో, డేవిడ్ వార్నర్ 167 మ్యాచ్‌లు ఆడి 6109 పరుగులతో మూడో స్థానంలో, రోహిత్ శర్మ 232 మ్యాచ్‌లు ఆడి 6014 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచారు.
బుంగమూతి పెట్టిన రితికా.. అయితే దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ.. ఐదో ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి మిడాఫ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ మార్ క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్‌లో భర్త ఆటను చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్నా రితికాకు నిరాశ మిగిలింది. హిట్‌మ్యాన్ ఔట్ అవ్వగానే బుంగమూతి పెట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
-
Ritika Sajdeh's reaction on Rohit Sharma dismissal. pic.twitter.com/MmYVkOf5Lr
— CricketGully (@thecricketgully) April 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ritika Sajdeh's reaction on Rohit Sharma dismissal. pic.twitter.com/MmYVkOf5Lr
— CricketGully (@thecricketgully) April 18, 2023Ritika Sajdeh's reaction on Rohit Sharma dismissal. pic.twitter.com/MmYVkOf5Lr
— CricketGully (@thecricketgully) April 18, 2023