ETV Bharat / sports

IPL 2023: బ్యాటర్ల వీరబాదుడు.. 18 సార్లు 200+ స్కోర్లు.. ఆ 4 పిచ్​లలోనే ఎక్కువ!

ఐపీఎల్​ 16వ సీజన్​లో ప్లేయర్లు దంచికొడుతున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. దాదాపు అన్ని మ్యాచుల్లోనూ భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 2023 సీజన్ సగం పూర్తి కాగా.. ఇప్పటికే 18 సార్లు 200కుపైగా స్కోర్లు నమోదు కావడం విశేషం.

ipl2023
ipl2023
author img

By

Published : Apr 28, 2023, 4:48 PM IST

IPL 2023 Records: టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద. బౌలర్లను చుక్కలు చూపిస్తూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే అభిమానులు కేరింతలు కొడుతూ ఉంటారు. ఆ లెక్కన ఐపీఎల్ 2023 గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. ఈ సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు ముగిసింది. అంటే సరిగ్గా సగం సీజన్ పూర్తయింది. ఇప్పటి వరకు చూసుకుంటే.. అత్యధిక స్కోరింగ్ రేట్ నమోదు చేసిన సీజన్ ఇదే కావడం విశేషం.

ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు 37 మ్యాచ్​లు జరిగాయి. ఇందులో 8.84 స్కోరింగ్ రేట్​తో పరుగులు వచ్చాయి. 15 సీజన్లలో ఇదే బెస్ట్ స్కోరింగ్ రేట్. 2018 ఐపీఎల్​లో ఇదే సమయానికి 8.7గా నమోదు కాగా.. ఆ రికార్డును ఈ సీజన్ తిరగరాసింది. ఇక 2018 సీజన్ ముగిసే సమయానికి అది 8.65గా ఉంది. మొత్తం ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరింగ్ రేట్ ఉన్న సీజన్ అదే. ఆ రికార్డును 2023 సీజన్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

ఐపీఎల్ 2023లో 37 మ్యాచ్​లు ముగిసే సమయానికి సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 181. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. అంతకుముందు 2020లో 177, 2018లో 174గా ఉంది. ఇక ఈ 37 మ్యాచ్​లలోనే 18సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కావడం మరో విశేషం. ఆ లెక్కనే ఇప్పటికే అత్యధిక 200+ స్కోర్లు రికార్డును ఈ సీజన్ సమం చేసింది. త్వరలోనే అది బ్రేకవుతుంది.

2023 సీజన్​లో ఓ మ్యాచ్​లో రెండు జట్లూ 200కుపైగా రన్స్ చేసిన సందర్భాలు ఆరు ఉన్నాయి. గతేడాది ఇలాంటివి ఐదు సందర్భాలు ఉండగా.. ఇప్పటికే ఆ రికార్డు బ్రేకయింది. ఈ సీజన్​లో కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, గువాహటిలో భారీ స్కోర్లు నమోదువుతున్నాయి. ఇక్కడ ప్రతి మ్యాచ్​లో సగటున 9కిపైగా స్కోరింగ్ రికార్డు నమోదైంది.

ఇక మొత్తంగా 200కుపైగా స్కోర్లు నమోదైన 18లో.. 14 ఈ నాలుగు వేదికల్లోనే వచ్చాయంటే ఇక్కడి పిచ్​లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్, చెన్నై గ్రౌండ్లు సీజన్ తొలి మ్యాచ్​లలో 200కుపైగా స్కోర్లు నమోదైనా.. తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దిల్లీ, లఖ్​నవూ, జయపుర వేదికలు బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తున్నాయి. తొలిసారి జయపురలో గురువారం (ఏప్రిల్ 27) 200కుపైగా స్కోరు నమోదైంది.

అశ్విన్ అరుదైన రికార్డు..
రాజస్థాన్​ రాయల్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 20 మంది బ్యాటర్లను డకౌట్‌ చేసిన తొలి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడును డకౌట్‌ చేసిన అశ్విన్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.