IPL 2023 RCB vs DC : శనివారం బెంగళూరు, దిల్లీ మధ్య మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని చూడడానికి పెద్ద ఎత్తున దిల్లీ వాసులు వచ్చారు. ఒక రకంగా కోహ్లీ లోకల్ బాయ్ కావడం వల్ల అతడిని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
Kohli Delhi Address : గతంలో విరాట్ కోహ్లీ దిల్లీలో నివసించేవాడు. దిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. ఆ తర్వాత గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్-1లో సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న తర్వాత.. సంసారాన్ని ముంబయికి షిఫ్ట్ చేశాడు విరాట్. ప్రస్తుతం ముంబయి అలీబాగ్ ప్రాంతంలోని ఓ భవనంలో నివాసం ఉంటున్నాడు.
ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, కోహ్లీ కుటుంబ సభ్యులు సైతం స్టేడియానికి వచ్చారు. టీమ్ఇండియా మాజీ స్టార్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మ్యాచ్‌ను వీక్షించాడు. తనతో పాటు తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్‌ను స్టేడియానికి తీసుకువచ్చాడు. వీఐపీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను తిలకించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం వారిద్దరూ విరాట్ కోహ్లీని కలిశారు. అతనితో సరదాగా ఫొటో దిగారు. ఈ ఫొటోను ఆర్యవీర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. గోట్ సింబల్ పక్కన లవ్ సింబల్ పెట్టి.. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
కోహ్లీ రికార్డుల పరంపర...
virat kohli ipl runs : సొంత గడ్డపై విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగించాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో తన జట్టు ఓడినా.. కోహ్లీ చరిత్ర సృష్టించి మరో ఘనత సాధించాడు. ఈ దేశవాలీ లీగ్‌లో 7000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఐపీఎల్ ఇప్పటి వరకు 5 సెంచరీలతో పాటు 50 అర్ధ శతకాలు పూర్తి చేశాడు. ఇందులో విశేషమేంటంటే.. కోహ్లీకి ఇది 50వ హాఫ్ సెంచరీ, ఈ సీజన్లో ఇది 50వ మ్యాచ్.. ఈ మ్యాచ్‌లో చేసిన అర్ధ సెంచరీతో 50వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
చిన్ననాటి కోచ్‌కు కోహ్లీ పాదాభివందనం..
కోహ్లీని చూడడానికి తన చిన్ననాటి కోచ్ వచ్చారు. మైదానంలో తన కోచ్‌ను కలుసుకున్న విరాట్.. ఆయనకు పాదాలకు నమస్కరించాడు. అనంతరం హగ్ చేసుకున్నాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడాడు. 'నా క్రికెట్ జర్నీ ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడే నా ఆటను చూసి సెలక్టర్లు నన్ను ఎంపిక చేశారు. ఈ మైదానం పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. ఇలాంటి అద్భుతమైన విషయాలతో దేవుడు నన్ను ఆశీర్వదించాడు' అంటూ తన జర్నీని గుర్తు చేసుకున్నాడు.
-
Virat Kohli meets his childhood coach and touches his feet. pic.twitter.com/NkH7HdLyJq
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Virat Kohli meets his childhood coach and touches his feet. pic.twitter.com/NkH7HdLyJq
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 6, 2023Virat Kohli meets his childhood coach and touches his feet. pic.twitter.com/NkH7HdLyJq
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 6, 2023