ETV Bharat / sports

IPL 2023: బట్లర్ వీరబాదుడు​.. యశస్వి హాఫ్​ సెంచరీ.. దిల్లీ టార్గెట్​ ఫిక్స్ - ఐపీఎల్​ 2023 పాయింట్స్​ టేబుల్​

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్ ఓపెనర్ జోస్​ బట్లర్ ఆకాశమే హద్దుగా​​ చెలరేగాడు. మరి దిల్లీ లక్ష్యం ఎంతంటే?

ipl 2023 rajasthan royals delhi capitals match

author img

By

Published : Apr 8, 2023, 5:16 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు ఇన్నింగ్స్​ ముగిసింది. 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. ప్రత్యర్థి దిల్లీకి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్​ ఓపెనర్లు జోస్​ బట్లర్, యశస్వి జైస్వాల్ దుమ్మురేపారు. దిల్లీ బౌలర్లలో ముఖేెశ్​ కుమార్​ రెండు వికెట్లు తీయగా.. కుల్​దీప్​ యాదవ్​, పొవెల్ తలో వికెట్​ పడగొట్టారు.

టాస్​ ఓడి రాజస్థాన్​ రాయల్స్​ బ్యాటింగ్​కు దిగింది. ఓపెనర్లుగా జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌ శుభారంభం చేశారు. యువ బ్యాటర్ యశస్వి విజృంభించాడు. ఖలీల్ అహ్మద్‌ వేసిన తొలి ఓవర్‌లో ఐదు ఫోర్లు బాదాడు. తొలి మూడు బంతులకు హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన యశస్వి చివరి రెండు బంతులను కూడా బౌండరీలుగా మలిచాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖేశ్‌కుమార్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో మూడో బంతికి యశస్వి జైస్వాల్ (60) ముఖేశ్‌కే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ సంజూ శాంసన్​ నిరాశపరిచాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ చక్కని బంతికి సంజూ(0) నార్జ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అనంతరం బరిలోకి దిగిన రియాన్‌ పరాగ్ (7)ను పొవెల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జోస్​ బట్లర్​(79) దుమ్మురేపాడు. ముఖ్​శ్​ బౌలింగ్​లోనే పెవిలియన్​ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్(8*)​, హెట్​మెయిర్(39*) నాటౌట్​గా నిలిచారు. ఫలితానికి రాజస్థాన్​ 199 పరుగులు సాధించింది.

6 బంతుల్లో 5 ఫోర్లు.. యశస్వి నయా రికార్డు!
ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే (4,4,4,0, 4, 4) ఐదు బౌండరీలు బాదాడు. వరుసగా మూడు బౌండరీలు కొట్టిన యశస్వి జైస్వాల్.. నాలుగో బంతిని డాట్ చేసి మరో రెండు బౌండరీలు బాదాడు. దాంతో జట్టుకు తొలి ఓవర్‌లోనే 20 పరుగులు ఇచ్చాయి. ఈ సీజన్‌లో ఫస్ట్ ఓవర్‌లో వచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం.

తొలి ఓవర్‌లోనే అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా ఖలీల్ అహ్మద్ చెత్త రికార్డు నమోదు చేశాడు. జైస్వాల్ ధాటికి ఖలీల్ అహ్మద్ తన లెంగ్త్‌ను మార్చుకున్నా.. ఫీల్ట్ సెటప్ తగ్గట్లు బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం జైస్వాల్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.