ETV Bharat / sports

IPL 2023 ఉత్కంఠ పోరులో చెన్నైపై పంజాబ్ విజయం.. కాన్వే శ్రమ వృథా - ipl csk vs pbks

ఐపీఎల్​ సీజన్​ 16లో భాగంగా భాగంగా చెన్నై సూపర్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్​ కింగ్స్ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో పంజాబ్​ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Ipl 2023 Csk vs Pbks
Ipl 2023 Csk vs Pbks
author img

By

Published : Apr 30, 2023, 7:25 PM IST

Updated : Apr 30, 2023, 8:11 PM IST

ఐపీఎల్​ 16 సీజన్​లో హోరాహోరీ మ్యాచ్​ల పరంపర కొనసాగుతోంది. చెన్నై సూపర్​ కింగ్స్​తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్​ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్​ కింగ్స్ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంపాక్ట్​ ప్లేయర్​గా వచ్చిన ప్రబ్​సిమ్రన్​ (24 బంతుల్లో 42 )దూకుడుగా ఆడాడు. ధావన్​ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వన్​డౌన్​లో వచ్చిన అథర్వా నిరాశ పర్చినా.. లివింగ్​ స్టోన్​ చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. నాలుగు సిక్సర్లతో 24 బంతుల్లోనే 40 పరుగులతో రాణించాడు . దూకుడుగా ఆడుతున్న లివింగ్​ స్టోన్​ను దేశ్​పాండే వెనక్కిపంపాడు. సామ్​ కరన్ 29 పరుగులు చేసి వెనుదిరిగాడు. చివర్లో జితేశ్​ శర్మ, సికిందర్​ రజా పోరాటంతో చెన్నైకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో దేశ్​పాండే 3, జడేజా 2 వికెట్లు తీశారు. పతిరణ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్​కే హైలెట్​గా​ నిలిచిన 'కాన్వే'కు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో పంజాబ్​ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన చెన్నైకి మెరుపు ఆరంభం లభించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే అజేయంగా (52 బంతుల్లో 92: 16x4, 1x6) పరుగులు సాధించాడు. మరో ఓపెనర్​ రుతురాజ్​ 37 పరుగులతో రాణించాడు. శివమ్​ ధూబే (28) పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్​ చివరి రెండు బంతులకు ఫినిషర్​ ధోని రెండు మెరుపు సిక్సర్లు బాదడం వల్ల సీఎస్​కే రెండొందల మార్క్​ అందుకుంది. ఇక పంజాబ్​ బౌలర్లలో అర్షదీప్​, సామ్​ కర్రన్, రాహుల్​ చాహర్, సికిందర్​ రజా తలో వికెట్​ తీశారు.

దంచికొట్టిన డేవాన్: ​ఈ సీజన్​లో దుమ్ములేపుతున్న డేవాన్​.. ఈ మ్యాచ్​లోనూ తన సుపర్​ ఫామ్​ను కొనసాగించాడు. పంజాబ్​ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఫోర్ల వర్షం కురిపించాడు. బౌండరీల ద్వారానే 70 పరుగులు చేశాడు. ఓ వైపు మరో ఓపెనర్​ రుతురాజ్​ నెమ్మదిగా ఆడుతూ అడపాదడపా ఫోర్లతో ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్​ సాఫీగా సాగుతున్న సమయంలో 9 ఓవర్లో సికిందర్​ రజా వీరిద్దరి జోడీని విడగొట్టాడు. దీంతో 86 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.

Last Updated : Apr 30, 2023, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.