ETV Bharat / sports

IPL 2023 Playoffs : ఆ రెండు జట్ల భవిష్యత్ హైదరాబాద్​ పైనే!.. ఏం జరుగుతుందో? - ఐపీఎల్ 2023 హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్

IPL 2023 Playoffs : ఐపీఎల్​ 16వ సీజన్​ లీగ్​ దశ చివరకు చేరుకుంది. ఆదివారం జరగబోయే బెంగళూరు, గుజరాత్​ పోరుతో ఈ ఏడాది ఐపీఎల్ లీగ్ మ్యాచ్​లకు తెర పడనుంది. ఇప్పటికే ఇంటి బాట పట్టిన సన్​రైజర్స్ హైదరాబాద్..​ రెండు స్టార్​ జట్ల భవితవ్యం తేల్చనుంది.

Etv Bharatsrh decides mi rcb future ipl 2023
హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్
author img

By

Published : May 17, 2023, 3:13 PM IST

IPL 2023 Playoffs : ఇండియన్ ప్రీమియర్​ లీగ్ 16వ సీజన్​లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్​ తప్ప ఏ జట్టు కూడా ఫ్లే ఆఫ్స్​కు అర్హత సాధించలేదు. ఈ రేసులో చెన్నై, లఖ్​నవూ ముందంజలో ఉండగా.. ముంబయి, బెంగళూరు, రాజస్థాన్​,​ పంజాబ్​, కోల్​కతా జట్లకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. దిల్లీ, హైదరాబాద్​ జట్లు ఇప్పటికే ఇంటి బాట పట్టాయి. చెన్నై, లఖ్​నవూ, ముంబయి, రాజస్థాన్, కోల్​కతా తలా ఒక మ్యాచ్​ ఆడాల్సి ఉండగా.. మిగిలిన బెంగళూరు, పంజాబ్ రెండేసి మ్యాచ్​లు ఆడాలి.

మరోవైపు హైదరాబాద్ ఈ సీజన్​లో మరో రెండు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. ఆరెంజ్ ఆర్మీ తదుపరి రెండు మ్యాచ్​ల్లో ముంబయి, బెంగళూరు జట్లతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​లు ఎస్​ఆర్​హెచ్​కు నామమాత్రమే అయినా.. వీటి ఫలితాలు ఇరు జట్లపై ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఎస్​ఆర్​హెచ్​.. ఆఖరి రెండు మ్యాచ్​ల్లో అద్భుతాలు చేసి ఇరు జట్ల ఆశలను ఆవిరి చేస్తే అంతే సంగతి.

తాజాగా లఖ్​నవూతో ఓటమి చవిచూసిన ముంబయికి ఫ్లే అఫ్స్​ అవకాశాలు సన్నగిల్లగా.. మరోవైపు బెంగళూరు జట్టుకు షాక్​లు ఇవ్వటం హైదరాబాద్​కు కొత్తేమీ కాదు. బుధవారం.. ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్​లో సన్​రైజర్స్ గెలిస్తే బెంగళూరు పరిస్థితి ఏంటా అని ఆర్​సీబీ జట్టు అభిమానులు కలవరపడుతున్నారు. కాగా ముంబయి తన ఆఖరి మ్యాచ్​లో హైదరాబాద్​ చేతిలో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. అందువల్ల సన్​రైజర్స్​తో మ్యాచ్​లు ఈ జట్లకు చాలా కీలకం కానున్నాయి.

టాప్​ రెండులో ఉన్న జట్లు క్వాలిఫైయర్ - 1, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్​ ఆడతాయి. క్వాలిఫైయర్ - 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్​కు వెళ్లగా.. ఎలిమినేటర్ మ్యాచ్​లో గెలిచిన జట్టు, క్వాలిఫైయర్ - 1లో ఓడిన జట్టుతో క్వాలిఫైయర్ - 2 లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్ చేరుతుంది. అంటే టాప్ 2లో ఉన్న జట్టుకు ఫైనల్స్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. అందుకే ఏ జట్టు అయినా మొదటి రెండు స్థానాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తాయి.

ఇక సీజన్ ఆరంభంలో చతికిలపడ్డ ముంబయి క్రమంగా పుంజుకొంది. ఈ సీజన్​లో ఏకంగా మూడు సార్లు 200 పై చిలుకు టార్గెట్​లను ఛేదించి ప్లే ఆఫ్స్​ రేసులోకి దూసుకొచ్చింది. కానీ మంగళవారం రాత్రి లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో ఓడి అవకాశాలను మరింత కష్టతరం చేసుకుంది. తమ ఆఖరి మ్యాచ్​లో హైదరాబాద్​పై గెలిస్తేనే ముంబయి టోర్నీలో నిలుస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.