IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ముంబయికి 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(104) శతక ప్రదర్శన చేశాడు. జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దుల్ ఠాకూర్ (13), రింకూ సింగ్(18), ఆండ్రూ రసెల్ (21*), సునీల్ నరైన్ (2*) పేలవ ప్రదర్శన చేశారు. ఇక, ముంబయి బౌలర్లలో హృతిక్ శోకీన్ 2 వికెట్లు పడగొట్టాడు. కామెరూన్ గ్రీన్, జాసెన్, పీయుశ్ చావ్లా, మెరెడిత్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్.. మంచి ప్రదర్శన చేశాడు. తొలి ఓవర్‌తో పాటు మరో ఓవర్ వేసి 17 పరుగులు ఇచ్చాడు. మరో బౌలర్ జాన్సెన్ నాలుగు ఓవర్లు వేసి.. ముంబయికి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. హృతిక్ 4 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు. రీలీ మెరెడిత్ కూడా నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్ల వైఫల్యం కనిపించింది. ఓపెనర్ గుర్భాజ్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఎన్ జగదీశన్ 5 బంతులు ఆడి కాతా తెరవకుండానే పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అలా 51 బంతుల్లో 104 పరుగులు చేసి.. మెరెడిత్ బౌలింగ్‌లో 18 ఓవర్లో ఔట్ అయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడలేదు. అస్వస్థతకు గురి కావడం వల్ల మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో 'మిస్టర్ 360' సూర్యకుమార్ యాదవ్ ముంబయికి సారథ్యం వహించాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: నితీశ్ రాణా(కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, ఎన్ జగదీశన్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి
ముంబయి ఇండియన్స్ తుది జట్టు: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, అర్జున్ తెందూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్