ETV Bharat / sports

IPL 20223 GT VS MI : సూర్య సెంచరీ-రషీద్​ ఆల్​రౌండ్​ షో.. ఇంకా మ్యాచ్​ హైలైట్స్​ ఏంటంటే?

IPL 2023 MI vs GT Highlights : ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ముంబయి ఇండియన్స్​, గుజరాత్​ టైటాన్స్​ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో పలు రికార్డులు చోటుచేసుకున్నాయి. అవేంటో చూసేయండి...

Surya Century. rashid all round ahow
సూర్య సెంచరీ. రషీద్ ఆల్​రౌండ్ షో
author img

By

Published : May 13, 2023, 11:24 AM IST

Updated : May 13, 2023, 2:09 PM IST

IPL 2023 suryakumar yadav century : ముంబయి, గుజరాత్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్​లో సూర్య కుమార్ ఆటే హైలైట్​. కళ్లు చెదిరే షాట్లతో నమ్మశక్యం కాని రీతిలో సాగింది అతడి ఆట. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా గుజరాత్ బౌలర్లను ఒక్కొక్కరిగా టార్గెట్​ చేస్తూ వారిపై విరుచుకుపడ్డాడు. లీగ్ ఆరంభంలో కాస్త తడబడ్డ సూర్య.. తర్వాత పుంజకున్న తీరు అద్భుతం. ఈ మ్యాచ్​లో 32 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసిన సూర్య, మరో 17 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని స్టాండ్స్​లోకి పంపిన సూర్య ఐపీఎల్​లో మొదటిసారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు.

రోహిత్ సిక్సర్ల మోత.. ఈ సీజన్​లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్న ముంబయి కెప్టెన్ రోహిత్​ ఈ మ్యాచ్​లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్​గా రోహిత్​ రికార్డులకెక్కాడు. 252 సిక్సర్లతో హిట్​మ్యాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ తర్వాత వరుసగా ధోని 239, విరాట్ 229 రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్​గా రోహిత్ రెండో స్థానంలో ఉండగా... వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్​ 357సిక్సర్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు.

రషీద్ ఆల్​రౌండ్ షో.. ఈ మ్యాచ్​లో గుజరాత్ ఓడినప్పటికీ ఆ జట్టు ఆటగాడు రషీద్ ఖాన్ ఆల్​ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. మొదటగా బౌలింగ్ చేసిన రషీద్​ బంతితో మ్యాజిక్ చేశాడు. ఓపెనర్లు సహా యువ కెరటం నెహాల్ వధేరాను వెనక్కి పంపాడు. ఇక ఛేదనలో ఊహించని రీతిలో ముంబయి బౌలర్లపై దాడి చేశాడనే చెప్పుకోవాలి. గుజరాత్ ఓటమి దాదాపు ఖరారైనప్పటికీ.. రన్ రేట్ మెరుగుపరిచేందుకు రషీద్ క్రీజులో చిన్నపాటి బీభత్సం సృష్టించాడు. ఏకంగా 10 సిక్సర్లు బాది 79 పరుగులు చేసి గుజరాత్ ఓటమి అంతరాన్ని తగ్గించాడు.

12 ఏళ్ల తర్వాత వాంఖడేలో... దాదాపు 12 ఏళ్ల తర్వాత​ వాంఖడే స్టేడియంలో ముంబయి బ్యాటర్ సెంచరీ నమోదు చేశాడు. ముంబయి ఇండియన్స్ హోం గ్రౌండ్ వాంఖడేలో చివరి సారిగా సచిన్ తెందూల్కర్ 2011లో శతకం సాధించగా.. తాజాగా గుజరాత్​తో మ్యాచ్​లో సూర్య సెంచరీ బాది రికార్డు సృష్టించాడు.

తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. ముంబయి తరఫున లెండిల్ సిమన్స్ 2014లో సెంచరీ సాధించాడు. అ తర్వాత ముంబయి ఆటగాళ్లెవరూ శతకం సాధించలేకపోయారు. దాదాపు తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర దించుతూ సూర్య సెంచరీ బాదీ చరిత్రకెక్కాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డిఫెండింగ్​ ఛాంపియన్​పై తొలిసారి.. 2022 లో వచ్చీ రాగానే టైటిల్ ఎగరేసుకు పోయిన గుజరాత్ ఈ సీజన్​లోనూ అదరగొడుతుంది. గుజరాత్ జట్టుపై ఇప్పటి వరకూ ఏ ప్లేయర్​ కూడా శతక ఇన్నింగ్స్​ బాదలేదు. తాజాగా సూర్య.. శుక్రవారం నాటి మ్యాచ్​లో సెంచరీ నమోదు చేసి ఆ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.

ఎవరీ వినోద్​.. కేరళకు చెందిన ఆటగాడు విష్ణు వినోద్​ సుమారు 6 ఏళ్ల అనంతరం ఐపీఎల్​లో పునరాగమనం చేశాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్​లో ఆడుతున్న విష్ణు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. క్రీజులోకి రావటంతోనే గుజరాత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. మూడు వికెట్లు కోల్పోయిన ముంబయిని ఆదుకుని వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఈ క్రమంలోనే సూర్యతో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 20 బంతుల్లో 30 పరుగులు చేసి భారీ షాట్​కు ప్రయత్నంచి వెనుదిరిగాడు.

ఇంపాక్ట్ చూపించాడుగా.. ఈ మ్యాచ్​లో ముంబయి తరఫున ఇంపాక్ట్ ప్లేయర్​గా బరిలోకి దిగిన ఆకాశ్ మధ్వాల్​ ఆకట్టుకున్నాడు. కీలకమైన వృద్ధిమాన్, గిల్​, డేంజర్​ బ్యాటర్ మిల్లర్​ వికెట్లు పడగొట్టి గుజరాత్​ను కోలుకోలేని దెబ్బతీశాడు. పటిష్ఠమైన బౌలింగ్​లేక ఇబ్బందులు పడుతున్న ముంబయికి ఇప్పుడు ఆకాశ్ ఆశాకిరణంలా కన్పిస్తున్నాడు.

Last Updated : May 13, 2023, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.