ETV Bharat / sports

IPL 2023: చేతులెత్తేసిన సన్​రైజర్స్​ బ్యాటర్లు.. లఖ్​నవూ లక్ష్యం ఎంతంటే? - ఐపీఎల్​ 2023 లేటెస్ట్ వార్తలు

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో సన్​రైజర్స్​ ఇన్నింగ్స్ ముగిసింది. లఖ్​నవూ టార్గెట్ ఎంతంటే?

ipl 2023 lucknow super giants sunriser hyderabad match

author img

By

Published : Apr 7, 2023, 9:11 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో సన్​రైజర్స్​ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే సాధించారు. ప్రత్యర్థి లఖ్​నవూకు 122 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లఖ్​నవూ బౌలర్లలో కృనాల్​ పాండ్య మూడు వికెట్లు పడగొట్టాడు. అమిత్​ మిశ్రా రెండు వికెట్లు, రవి బిష్ణోయ్​, యశ్​ ఠాకూర్​ తలో వికెట్​ పడగొట్టారు.

టాస్‌నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లుగా అన్‌మోల్‌, మయాంక్ అగర్వాల్ క్రీజ్‌లోకి వచ్చారు. కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (8) కవర్స్‌లో స్టొయినిస్‌ చేతికి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 21 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అన్‌మోల్‌ సింగ్‌ (31) ఔటయ్యాడు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లోనే ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా సమీక్షలో అంపైర్స్‌ కాల్‌ రావడంతో డగౌట్‌కు చేరకతప్పలేదు.

సన్‌రైజర్స్ సారథి ఐదెన్‌ మార్‌క్రమ్‌ (0) లీగ్​ తొలి మ్యాచ్​లోనే నిరాశపరిచాడు. డకౌట్​గా పెవిలియన్‌ బాట పట్టాడు. తొలి బంతికే క్లీన్‌బౌల్డ్‌గా ఔటయ్యాడు. కృనాల్‌ పాండ్య వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతికి బౌల్డ్‌ అవడంతో పెవిలియన్‌కు చేరాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (3) కూడా పెవిలియన్‌కు చేరాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన బ్రూక్‌ స్టంపౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్‌ త్రిపాఠి (35) పెవిలియన్‌కు చేరాడు. యశ్‌ ఠాకూర్ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు యత్నించి అమిత్ మిశ్రా అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు.

వాషింగ్టన్ సుందర్ (16) భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. లాంగాఫ్‌లో దీపక్‌ హుడా అద్భుతంగా ఒడిసిపట్టాడు. అమిత్ మిశ్రా రెండో వికెట్‌ను తీశాడు. సుందర్ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన అదిల్ రషీద్ ఫోర్‌ కొట్టాడు. అయితే చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి దీపక్ హుడా చేతికి చిక్కాడు.హైదరాబాద్‌ స్వల్ప వ్యవధిలో మరో వికెట్‌ను కోల్పోయింది. అయితే ఈసారి రనౌట్‌ రూపంలో కావడం గమనార్హం. జయదేవ్‌ ఉనద్కత్‌ బౌలింగ్‌లో ఉమ్రాన్‌ (0) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. చివరల్లో అబ్దుల్​ షమద్​ రెండు సిక్సులు బాదాడు. కేవలం పది బంతుల్లో 21 పరుగులు సాధించాడు. షమద్​, భువనేశ్వర్​ నాటౌట్​గా నిలిచారు. దీంతో సన్​రైజర్స్​ స్కోరు 121 పరుగులు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.