ఇది కదా అసలైన ఐపీఎల్ మజా అంటే. బంతి బంతికి తీవ్ర ఉత్కంఠ. గెలుపు ఎవరిని వైపు నిలుస్తుందో తెలియదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన పోరులో.. స్టేడియంలో ఉన్న ఆడియెన్స్‌తో పాటు టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది క్రికెట్ ప్రియుల ఎదురైన ఉత్కంట క్షణాలు. వారి మునివేళ్లపై నిలుచోబెట్టిందీ మ్యాచ్. ఇక పరాజయమే అనుకుని ఆశలు లేని పరిస్థితుల్లోంచి విజయతీరాలకు వచ్చిన కేఎల్ రాహుల్ సేన.. భారీగా పరుగులు చేసి కూడా ఓటమి దిశగా సాగిన బెంగళూరు... అంతలోనే ఇరు జట్లను దోబుచులాడిన విజయం.. అలా చివరి బంతికి వరకు క్రికెట్ అభిమానులను ఆసాంతం రక్తికట్టించింది. మొత్తంగా ఈ నాటకీయపరిణామాల మధ్య చివరి బంతికి ఫలితం దక్కింది. దీంతో లఖ్‌నవూను సంబరాల్లో మునిగిపోగా, ఆర్సీబీని తీవ్ర నిరాశలోకి నెట్టింది. మరి ఆ లాస్ట్ బాల్‌కు రాహుల్ సేన ఎలా విజయం సాధించిందో ఆ ఉత్కంఠ క్షణాలను చూసేయండి..
ఇదంతా ఎవరూ ఊహించనిదే.. అసలు ఈ మ్యాచ్ చివరి బంతికి వరకు సాగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. బెంగళూరు నిర్దేశించిన లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూలో.. పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మ్యాచ్ ముందే లఖ్‌నవూ చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమనిపించేలా కనిపించింది. ఇంకా 4 ఓవర్లలో చేయాల్సినది 28 పరుగులు మాత్రమే. కానీ 17వ ఓవర్లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 4 పరుగులే ఇచ్చి పూరన్ వికెట్ పడగొట్టాడు. అయినా లఖ్‌నవూకు ఏమీ అప్పుడు దారులు మూసుకుపోలేదు. బదోని, ఉనద్కత్ మంచిగా ఆడి టీమ్ లక్ష్యం వైపు నడిపించారు. దీంతో లఖ్‌నవూకు 9 బంతుల్లో 7 పరుగులే అవసరమయ్యాయి.
ఇక 19వ ఓవర్ నాలుగో బంతిని పార్నెల్ ఫుల్‌టాస్ వేయగా.. బదోని స్కూప్ షాట్ బాదాడు. బంతి డైరెక్ట్‌గా వెళ్లి ఫైన్‌లెగ్‌లో స్టాండ్స్ అవతల పడింది. దీంతో సమీకరణం ఎనిమిది బంతుల్లో 1గా మారింది. లఖ్‌నవూ అవలీలగా కొట్టేస్తుందని అంతా అనుకున్నారు. కానీ బంతిని బాదాకా.. దాన్ని చూస్తూ బదోనీ తన బ్యాట్‌ను స్టంప్స్‌కు అనుకోకుండా తాకించేశాడు. దీంతో అతడు హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు.
ఇక్కడే మొదలైంది అసలు ఎగ్జైట్మెంట్. చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. రెండో బంతికి మార్క్ వుడ్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బంతికి బిష్ణోయ్ రెండు పరుగులు, నాలుగో బంతికి ఒక్క పరుగు వచ్చింది. అలా 2 బంతుల్లో 3 పరుగులు వచ్చాయి. ఇక స్కోర్లు సమమయ్యాయి. ఐదో బంతికి ఉనద్కత్ ఔట్ అయ్యాడు. ఇక మిగిలి ఉంది ఒక్కటే బంతి. దీంతో చివరి బాల్ వేయబోతూ హర్షల్.. బిష్ణోయ్‌ను మన్కడింగ్ చేశాడు. కానీ అది నాటౌట్ అని ప్రకటించారు. దీంతో మళ్లీ వేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించి మిస్ అయిన అవేశ్.. బిష్ణోయ్‌తో కలిసి క్విక్ సింగిల్ తీశారు. మరోవైపు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చురుగ్గా స్పందించి రనౌట్ చేయలేకపోయాడు. దీంతో లఖ్‌నవూ విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు.
-
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
— IndianPremierLeague (@IPL) April 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
">𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
— IndianPremierLeague (@IPL) April 10, 2023
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
— IndianPremierLeague (@IPL) April 10, 2023
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
ఇదీ చూడండి: IPL 2023: రాకెట్ స్పీడ్‌లో మార్క్ వుడ్ బౌలింగ్.. ఫాఫ్ డుప్లెసిస్ భారీ సిక్సర్..