ETV Bharat / sports

IPL 2023: LSG vs CSK : మ్యాచ్​ వర్షార్పణం... ఇరు జట్లకు చెరో పాయింట్​ - కెప్టెన్​ కృనాల్ పాండ్య​

ఐపీఎల్​ సీజన్​ 16లో భాగంగా చెన్నై సూపర్​ కింగ్స్​, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ మ్యాచ్​... వర్షం కారణంగా రద్దు చేస్తు, ఇరు జట్లకు చెరో పాయింట్​ ఇస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ipl 2023 csk vs lsg
ipl 2023 csk vs lsg
author img

By

Published : May 3, 2023, 7:39 PM IST

Updated : May 3, 2023, 9:01 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 2023లో మొదటిసారి వర్షం కారణంగా మ్యాచ్​ రద్దు అయ్యింది. చెన్నై సూపర్​ కింగ్స్​, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ మధ్య మ్యాచ్​ జరగాల్సి ఉండగా.. ప్రారంభం నుంచే వరణుడు అడ్డుపడ్డాడు. దీంతో మ్యాచ్​ అరగంట ఆలస్యంగా ప్రారంభం అయింది. ఫస్ట్​ ఇన్నింగ్స్​ 19.2 ఓవర్ల వద్ద వర్షం మరోసారి ఆటకు ఆటంకం కలిగించింది. ఎంతకీ వర్షం తగ్గనందున మ్యాచ్​ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్​ ఇచ్చారు. దీంతో లఖ్​నవూ రెండో స్థానంలో ఉండగా.. చెన్నై మూడో స్థానంలో కొనసాగుతోంది.

టాస్​ గెలిచిన సీఎస్కే లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. బ్యాటింగ్​కు దిగిన లఖ్​నవూకు మంచి ఆరంభం దక్కలేదు. పిచ్​పై తేమ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఓపెనర్​ మేయర్స్​ను మొయిన్​ అలీ ఔట్​ చేశాడు. ఆ తర్వాత లఖ్​నవూ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మనన్​ వోహ్రా(10), కరణ్​ శర్మ(9), కృనాల్ పాండ్య ​(0), మార్కస్​ స్టోయినిస్​(6), గౌతమ్​(1) లు వెంటవెంటనే వెనుదిరిగారు. సీఎస్కే బౌలర్లలో మొయిన్​, పతిరణ, తీక్షణ తలో రెండు వికెట్లు తీశారు. ఇంత లో-స్కోరింగ్​ ఇన్నింగ్స్​లో కూడా సీఎస్కే బౌలర్​ దీపక్ చాహర్​ పదికి పైగా ఎకనమీతో 41 పరుగులు సమర్పించుకున్నాడు.​

ఆదుకున్న బదోనీ...
10 ఓవర్లు ముగిసేసరికి లఖ్​నవూ 44-5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన బదోనీ పూరన్​తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. సీఎస్కే బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదాడు. మరో ఎండ్​లో పూరన్(20)​ బాధ్యతగా వికెట్​ కోల్పోకుండా ఆడాడు.​ బదోనీ (59*) హాఫ్​ సెంచరీతో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్​లో నాలుగు సిక్సర్లు నమోదయ్యాయి. ఈ నాలుగు సిక్స్​లు బాదోనియే బాదాడు. వీరిద్దరూ ఆరో వికెట్​కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పద్దెనిమిదో ఓవర్లో పూరన్​ను, ఆఖరి ఓవర్లో గౌతమ్​ను.. మతీషా పతిరణ పెవీలియన్​కు పంపాడు.

మ్యాచ్​కు రాహుల్​ దూరం...
సోమవారం రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూర్​తో జరిగిన మ్యాచ్​లో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయం కారణంగా రాహుల్​ తర్వాతి మ్యాచ్​లు ఆడేది కూడా డౌటే. అయితే రాహుల్ గాయానికి చికిత్సకు సంబంధించిన అంశాన్ని బీసీసీఐ టేకప్​ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్​ ఉన్నందున ఆ సమయంలోపు అతడు గాయం నుంచి కోలుకోవాలని రాహుల్​ అభిమానులు ఆశిస్తున్నారు. గత మ్యాచ్​లో కూడా ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చిన రాహుల్​... నొప్పితో బాధ పడుతూనే బ్యాటింగ్​ చేశాడు. రాహుల్​ ఇంకా కోలుకోని కారణంగా ఈరోజు కృనాల్​ పాండ్య లఖ్​నవూ కెప్టెన్​గా బాధ్యతలు తీసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్​లో కృనాల్​ గోల్డెన్​ డక్​గా పెవీలియన్​ చేరాడు.

Last Updated : May 3, 2023, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.