ETV Bharat / sports

IPL 2023: హైదరాబాద్​ X కోల్​కతా.. టాస్​ ఎవరు గెలిచారంటే? - సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఐపీఎల్​ 2023

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా హైదరాబాద్​, కోల్​కతా జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా టాస్​ ఎవరు గెలిచారంటే?

kkr vs srh toss
kkr vs srh toss
author img

By

Published : Apr 14, 2023, 7:03 PM IST

Updated : Apr 14, 2023, 7:41 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా.. హైదరాబాద్​, కోల్​కతా జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా కోల్​కతా టాస్​ గెలిచి.. బౌలింగ్​ ఎంచుకుంది. ప్రత్యర్థి హైదరాబాద్​కు బ్యాటింగ్​ అప్పగించింది. అయితే, ఈ సీజన్​లో ఇప్పటివరకు హైదరాబాద్ మూడు మ్యాచ్​లు ఆడి.. రెండింట్లో బోల్తా కొట్టింది. రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక, ఈ సీజన్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. ఆడిన మూడు మ్యాచ్​ల్లో రెండింట్లో గెలిచి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌క్రమ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్​ కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్​ కీపర్), ఎన్ జగదీశన్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

తక్కువ అంచనా వేయలేం..
రెండు మ్యాచ్​లు గెలిచి ఊపుమీదున్న కోల్​కతాను.. వారి సొంత గడ్డపైనే ఢీకొట్టి.. మరో విజయం సాధించాలను ఉవ్విల్లూరుతోంది సన్​రైజర్స్​ హైదరాబాద్​. అయితే, నైట్​ రైడర్స్​ బౌలింగ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే.. టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్ ఉమేశ్‌ యాదవ్‌, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్‌తో కూడిన పేస్‌ దళాన్ని ఎదుర్కోవడం హైదరాబాద్‌ బ్యాటర్లకు సులువైన విషయం కాదు. అలాగే వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ, సునీల్ నరైన్‌ వంటి స్పిన్నర్లు రాణించడం కోల్‌కతాకు అదనపు బలం.

వారు రాణిస్తే..
సన్‌రైజర్స్ జట్టులో బ్యాటర్లకు కొదవేంలేదు. కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్, మయాంక్‌ అగర్వాల్, రాహుల్‌ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, హెన్రిచ్‌ క్లాసెన్‌ ఉన్నారు. అయితే, గత మూడు మ్యాచుల్లోనూ భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ విఫలం కావడం హైదరాబాద్‌ అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ బ్రూక్ రాణించకపోతే తదుపరి మ్యాచుల్లో చోటు గల్లంతు కావడం ఖాయం. ఎన్నో ఆశలు పెట్టుకున్న మయాంక్‌ అగర్వాల్​ కూడా తన మార్క్ ఆటను ఆడలేకపోతున్నాడు. త్రిపాఠి, మార్‌క్రమ్ మాత్రమే కాస్త మెరుగ్గా ఆడుతున్నారు. బౌలింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ నిరాశపరిచాడు. సీనియర్‌ బౌలర్ భువనేశ్వర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. మయాంక్‌ మార్కండే, అదిల్‌ రషీద్‌, ఫజహల్‌ ఫరూఖి నియంత్రణతో కూడిన బౌలింగ్‌ వేయడం విశేషం.

Last Updated : Apr 14, 2023, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.