ETV Bharat / sports

IPL 2023 : ఇంపాక్ట్‌ ప్లేయర్ల 'ఇంపాక్ట్‌' ఎంత?.. ఏ జట్టు ఎక్కువ లాభపడింది? - ఇంపాక్ట్​ ప్లేయర్​ లఖ్​నవూ

ఐపీఎల్​ 16వ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. ఈసారి లీగ్​లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్​ ప్లేయర్​ అనే సరికొత్త ఆప్షన్​ను అన్ని జట్లు విజయవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. అయితే సీజన్​లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వివిధ జట్లు వినియోగించుకున్న ఇంపాక్ట్‌ ప్లేయర్ల వివరాలను తెలుసుకుందాం రండి.

ipl 2023 impact players impact in matches

author img

By

Published : Apr 13, 2023, 4:53 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​ రసవత్తరంగా సాగుతోంది. గత నాలుగు రోజులుగా ఉత్కంఠగా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్రికెట్‌ అభిమానులు ఈ నాలుగు మ్యాచ్‌లు చూడకపోయి ఉంటే అది పెద్ద నేరమని సోషల్‌మీడియాలో మీమ్స్‌ వస్తున్నాయి. ఆ నాలుగు మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు కావాల్సిన అసలుసిసలు టీ20 మజాను అందించాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ చివరి బంతి వరకు సాగిన ఈ నాలుగు మ్యాచ్‌ల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పైచేయి సాధిస్తే.. చివరి రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్నారు.

అయితే ఈ సారి సీజన్​ కొన్ని కొత్త రూల్స్​తో ప్రారంభమైంది. అందులో ఇంపాక్ట్​ ప్లేయర్ ఆప్షన్​ ఒకటి. ఈ సరికొత్త నిబంధన ప్రకారం టాస్‌ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్ల జాబితాను ప్రకటిస్తారు. వీరిలో ఒకరిని సంబంధిత జట్టు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వినియోగించుకుంటుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు, వికెట్ పడిన తర్వాత, బ్యాటర్ రిటైర్ అయిన తర్వాత, ఓవర్ పూర్తయిన సందర్భాల్లో పరిచయం చేయవచ్చు.

ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో అన్ని జట్లు ఈ అప్షన్‌ను విజయవంతంగా వినియోగించుకున్నాయి. లీగ్‌లో జరగబోయే తర్వాత మ్యాచ్​ల్లో అన్ని జట్లు ఈ ఆప్షన్‌ను ఇంకా బెటర్‌గా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. లీగ్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో కోల్​కతా జట్టు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆప్షన్‌ను సక్సెస్​ఫుల్‌గా వాడుకుందని చెప్పాలి. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌ సుయాష్​ శర్మ స్థానంలో వెంకటేశ్‌ అయ్యర్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దించి విక్టరీ సాధించింది. ఆ మ్యాచ్‌లో అయ్యర్‌ 40 బంతుల్లో 83 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో వివిధ జట్లు వినియోగించుకున్న ఇంపాక్ట్‌ ప్లేయర్ల వివరాలు..

  • గుజరాత్‌ X చెన్నై: అంబటి రాయుడు స్థానంలో తుషార్‌ దేశ్‌పాండే, కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో సాయి సుదర్శన్‌
  • పంజాబ్‌ X కోల్​కతా: వరుణ్‌ చక్రవర్తి స్థానంలో వెంకటేశ్‌ అయ్యర్‌, భానుక రాజపక్ష స్థానంలో రిషి ధవన్‌
  • లఖ్​నవూ X దిల్లీ: ఆయుష్​ బదోని స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌, ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో అమాన్‌ ఖాన్‌
  • సన్‌రైజర్స్‌ X రాజస్థాన్‌: ఫజల్‌హక్‌ ఫారూఖీ స్థానంలో అబ్దుల్‌ సమద్‌, యశస్వి జైస్వాల్‌ స్థానంలో నవ్‌దీప్‌ సైనీ
  • బెంగళూరు X ముంబయి: సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో బెహ్రెన్‌డార్ఫ్‌
  • చెన్నై X లఖ్​నవూ: ఆవేశ్‌ ఖాన్‌ స్థానంలో బదోని, రాయుడు స్థానంలో తుషార్‌ దేశ్‌పాండే
  • దిల్లీ X గుజరాత్‌: సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌, జాషువ లిటిల్‌ ప్లేస్‌లో విజయ్‌ శంకర్‌
  • రాజస్థాన్‌ X పంజాబ్‌: చాహల్‌ ప్లేస్‌లో ధ్రువ్​ జురెల్‌, ప్రభ్‌సిమ్రన్‌ స్థానంలో రిషి ధవన్‌
  • కోల్​కతా X బెంగళూరు: వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానంలో సుయాష్​ శర్మ, సిరాజ్‌ ప్లేస్‌లో అనూజ్‌ రావత్‌
  • లఖ్​నవూ X సన్‌రైజర్స్‌: రాహుల్‌ త్రిపాఠి ప్లేస్‌లో ఫజల్‌హక్‌ ఫారూకీ, అమిత్‌ మిశ్రా స్థానంలో బదోని
  • రాజస్థాన్‌ X దిల్లీ: ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో పృథ్వీ షా, బట్లర్‌ ప్లేస్‌లో మురుగన్‌ అశ్విన్‌
  • ముంబయి X చెన్నై: టిమ్‌ డేవిడ్‌ స్థానంలో కుమార్‌ కార్తికేయ, దీప్‌ చాహర్‌ స్థానంలో రాయుడు
  • గుజరాత్‌ X కోల్​కతా: సాయి సుదర్శన్‌ స్థానంలో జాషువ లిటిల్‌, సుయాశ్‌ ప్లేస్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌
  • సన్‌రైజర్స్‌ X పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ స్థానంలో సికందర్‌ రజా
  • బెంగళూరు X లఖ్​నవూ: అమిత్‌ మిశ్రా స్థానంలో బదోని, అనూజ్‌రావత్‌ ప్లేస్‌లో కర్ణ్‌ శర్మ
  • దిల్లీ X మంబయి: పృథ్వీ షా స్థానంలో ముకేశ్‌ కుమార్‌
  • చెన్నై X రాజస్థాన్‌: బట్లర్‌ స్థానంలో జంపా, మగాలా ప్లేస్‌లో రాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.