ETV Bharat / sports

IPL 2023 Final : డబుల్ ధమాకానా.. పాంచ్​ పటాకానా? విన్నర్ ప్రైజ్​మనీ ఎంతంటే.. - ఐపీఎల్ 2023 రికార్డులు

IPL 2023 Final : దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌ ఫ్యాన్స్​కు మజాను అందిస్తోన్న ఐపీఎల్‌ 16వ సీజన్​కు ఆదివారంతో తెరపడనుంది. సీజన్ ప్రారంభ మ్యాచ్​లో ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే ఫైనల్​లోనూ తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్​లో ఏ జట్టు విజయం సాధించినా.. రికార్డే అవుతుంది అదేంటంటే..

IPL 2023 Final Match
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్
author img

By

Published : May 27, 2023, 8:22 PM IST

Updated : May 27, 2023, 10:50 PM IST

IPL 2023 Chennai Super Kings : ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్​ లీగ్​ దశలో అదరగొట్టింది. గత సీజన్​లో పేలవ ప్రదర్శనతో 9వ స్థానంలో నిలిచిన చెన్నై.. ఈసారి అద్భుతంగా పుంజుకుందంటే కారణం ధోనీనే. మహీ తనదైన వ్యూహాలతో జట్టును విజయబాటలో నడిపిస్తున్నాడు. ఏ మాత్రం అనుభవం లేని యువ బౌలర్లను ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలు రాబట్టుతున్నాడు. లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై.. క్వాలిఫయర్‌-1 లో డిఫెండింగ్‌ చాంఫియన్‌ గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన ఆ చెన్నై.. ఫైనల్లో విజయం సాధించి ఐదో టైటిల్ నెగ్గాలని తహతహలాడుతుంది. ఇక ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ఊహాగానాల్లో ఉన్న చెన్నై అభిమానులు.. కప్​ గెలిచి ధోనీకి గిఫ్ట్​ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

ఓపెనింగ్ బ్యాటర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవన్‌ కాన్వే చెన్నైకి అతిపెద్ద బలం. సీజన్​ మొదటి నుంచే వీరిద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డర్​లో శివమ్ ధూబే, రవీంద్ర జడేజా, రహానేలు అవసరమైనప్పుడల్లా జట్టును ఆదుకుంటున్నారు. ఇక చివర్లో ఫినిషింగ్​కి ధోని ఉండనే ఉన్నాడు. బౌలింగ్​లో తుషార్‌ దేశ్‌పాండే, పతిరణ రాటు దేలారు. ఇక దీపక్‌ చాహర్‌, తీక్షణ, జడేజా కీలక సమయాల్లో వికెట్లు తీస్తు జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్​లోనూ జట్టు సభ్యులందరూ సమష్టి కృషితో రాణిస్తే చెన్నై విజయాన్ని ఎవరూ ఆపలేరు.

CSK with fourth Title
ఐపీఎల్ 2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్.. చెన్నైకిది నాలుగో టైటిల్

IPL 2023 Gujarat Titans : గత సీజన్​లోనే ఐపీఎల్​లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. అరంగేట్ర సీజన్‌ నుంచి ఇప్పటి వరకూ అన్ని విభాగాల్లో రాణిస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. బ్యాటింగ్​లో ముఖ్యంగా గిల్ సునాయాసంగా శతకాలు బాదేస్తూ, రికార్డులను చెరిపేస్తున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్​ మ్యాచ్​లోనూ గిల్ తన ఫామ్​ను కొనసాగిస్తే.. గుజరాత్​ భారీ స్కోరు సాధించడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

క్వాలిఫయర్-2 లో సాయి సుదర్శన్‌ టచ్​లోకి రావటం గుజరాత్​కు కలిసొచ్చేదే. ఈ సీజన్​లో కెప్టెన్ హర్దిక్ పాండ్య నుంచి చెప్పకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. ఫైనల్లో పాండ్య చెలరేగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. షమీ (28 వికెట్లు), రషీద్‌ ఖాన్‌ (27 వికెట్లు), మోహిత్‌ శర్మ(24)లతో గుజరాత్ బౌలింగ్​ విభాగం చెన్నై కంటే మెరుగ్గా ఉందనే చెప్పాలి. గుజరాత్ ఆల్​రౌండ్ ప్రదర్శనతో మెరిస్తే.. ఆ జట్టు వరుసగా రెండోసారి టైటిల్​ను ముద్దాడుతుంది.

IPL 2022 Winner GT
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్

ఇరు జట్లను ఊరిస్తున్న రికార్డులు.. ఈ ఫైనల్​లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఐదో టైటిల్ సాధించిన జట్టుగా ముంబయి ఇండియన్స్ సరసన నిలుస్తుంది. మరోవైపు గుజరాత్ విజయం సాధిస్తే.. అరంగేట్ర సీజన్​ నుంచి వరుసగా రెండోసారి ఛాంపియన్​గా నిలిచి రికార్డులకెక్కుంది. మరి చెన్నై పాంచ్ పటాకానా... గుజరాత్ డబుల్ ధమాకానా అనేది ఆదివారం అర్థ్రరాత్రి వరకు వేచి చూడాలి.

Pandya Dhoni
ఐపీఎల్​ ట్రోఫీతో పాండ్య - ధోనీ

IPL 2023 Prize Money : ఈ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచే జట్టు రూ.20 కోట్లు ప్రైజ్‌మనీని దక్కించుకుంటుంది. రన్నరప్‌గా నిలిచే టీమ్‌కు రూ. 13 కోట్లు ఇవ్వనున్నారు. అదే విధంగా మూడో స్థానంలో నిలిచిన ముంబయికి రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన లఖ్‌నవూకు రూ.6.5 కోట్లు ఇవ్వనున్నారు.

అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​కు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​కు రూ.15 లక్షల ప్రైజ్‌మనీ అందుకుంటారు. ఇక ఇవే కాకుండా సూపర్‌ స్ట్రైకర్ ఆఫ్‌ ది సీజన్‌గా నిలిచిన ఆటగాడు రూ.15 లక్షలు దక్కించుకుంటారు. అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్​, గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌గా నిలిచిన ఆటగాళ్లు చెరో రూ.12 లక్షలు దక్కించుకుంటారు.

Last Updated : May 27, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.