ETV Bharat / sports

IPL 2023 Qualifier 2 : గుజరాత్​ x ముంబయి.. చెన్నైని ఢీ కొట్టేదెవరో? ​టాస్​ ఎవరు గెలిచారంటే? - mi vs GT 2023 scorecard

IPL 2023 Qualifier 2 : ఐపీఎల్​ 16వ సీజన్ అంతిమ దశకు చేరుకుంది. ఫైనల్​కు వెళ్లేందుకు క్వాలిఫయర్​-2లో గుజరాత్​, ముంబయి మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టాస్​ ఎవరు గెలిచారంటే?

Gujarat Titans vs Mumbai Indians Qualifier 2

author img

By

Published : May 26, 2023, 7:48 PM IST

Updated : May 26, 2023, 10:16 PM IST

IPL 2023 Qualifier 2 : దాదాపు రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్​ 16వ సీజన్.. చివరి దశకు చేరుకుంది. ఫైనల్​లో సమరంలో అడుగుపెట్టేందుకు క్వాలిఫయర్​-2లో గుజరాత్ టైటాన్స్​​, ముంబయి ఇండియన్స్​ జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో ముంబయి టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది. గుజరాత్​ జట్టుకు బ్యాటింగ్​​ అప్పగించింది. టాస్​కు ముంది కొద్దిగా వర్షం పడింది. కొద్ది సేపటి తర్వాత పిచ్​ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్​ను ప్రారంభించారు.

IPL 2023 Qualifier 2 Pitch Report : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. అలాగే మంచి పేస్‌, బౌన్స్‌ లభించే పిచ్‌ను రూపొందించినట్లు సమాచారం. అయితే టాస్‌ గెలిచిన జట్టు ఛేజింగ్​కే మొగ్గు చూపే అవకాశముంది. ఛేజింగ్​లో మంచు ప్రభావం పెద్దగా పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు : వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమి
ఇంపాక్ట్‌ ప్లేయర్లు : జాషువా లిటిల్‌, శ్రీకర్ భరత్, ఓడియన్‌ స్మిత్, రవిశ్రీనివాసన్‌ సాయి కిశోర్‌, శివమ్‌ మావి

ముంబయి ఇండియన్స్ తుది జట్టు : ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), రోహిత్ శర్మ(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూశ్​ చావ్లా, జేసన్ బెరన్​డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్​ మధ్వాల్
ఇంపాక్ట్‌ ప్లేయర్లు : రమణ్‌దీప్‌ సింగ్, విష్ణు వినోద్, నెహాల్ వధెరా, సందీప్ వారియర్, రాఘవ్‌ గోయల్

ఈ క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు మే 28న చైన్నైతో ఫైనల్​లో తలపడతుంది. ఈ మ్యాచ్​లో గుజరాత్​ గెలిస్తే.. వరుసగా రెండోసారి ఫైనల్​కు చేరుకుంటుంది. ఇక ముంబయి విజయం సాధిస్తే ఏడోసారి ఫైనల్​కు వెళ్లిన జట్టుల్లో రెండు స్థానంలో నిలుస్తుంది. ఈ క్రమంలో గుజరాత్‌ టైటాన్స్​ వరుసగా రెండోసారి ఫైనల్‌ ఆడుతుందా లేదా ముంబయి జట్టు ఏడోసారి ఫైనల్‌కు చేరుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Last Updated : May 26, 2023, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.