ETV Bharat / sports

IPL 2023 : తప్పు ఒప్పుకున్న కృనాల్​ పాండ్య.. అదే కొంప ముంచిందంటూ..

IPL 2023 Eliminator LSG vs MI : కీలక ఎలిమినేటర్ పోరులో ముంబయి చేతిలో ఓటమిపాలైంది లఖ్​నవూ జట్టు. దీంతో తన తప్పు ఒప్పుకున్నాడు లఖ్​నవూ టీమ్​ కెప్టెన్ కృనాల్ పాండ్య. ఆ పరాజయానికి పూర్తి బాధ్యత తనదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

IPL 2023 Eliminator LSG vs MI
IPL 2023 Eliminator LSG vs MI
author img

By

Published : May 25, 2023, 9:26 AM IST

Updated : May 25, 2023, 12:05 PM IST

IPL 2023 Eliminator LSG vs MI : ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పాడు లఖ్​నవూ జట్టు కెప్టెన్​ కృనాల్​ పాండ్య. బుధవారం జరిగిన ఎలిమినేటర్​ మ్యాచ్​లో ముంబయి చేతిలో 81 పరుగుల తేడాతో ఓటమిపాలైంది లఖ్​నవూ. ఈ ఓటమిపై స్పందించిన కృనాల్​ పాండ్య.. తాను సరిగా బ్యాటింగ్​ చేయకపోవడం వల్లే ఓడిపోయామని అన్నాడు.

'నేను ఆ షాట్‌ ఆడకపోయి ఉంటే బాగుండేది. అతడు వికెట్​ కోల్పోవడం వల్ల వికెట్‌తో లక్నో పతనం మొదలైంది. టార్గెట్​ను ఛేదించే క్రమంలో మొదట్లోనే వికెట్లు కోల్పోయాం. అయినా స్టాయినిస్​ బ్యాటింగ్‌తో 69/2తో పుంజుకునే స్థితిలోనే ఉన్నాం. కానీ ఆ సమయంలో నేను ఆడిన చెత్త షాట్​తో మా పతనం ప్రారంభమైంది. నేను ఆ షాట్ ఆడకూడదు. సులభంగా గెలిచే మ్యాచ్​లో నా వల్లే లఖ్​నవూ ఓటమిపాలైంది. ఈ పరాజయానికి పూర్తి బాధ్యత నాదే. అయితే, వికెట్​లో మార్పు లేదు. మేము కొంచెం మెరుగ్గా ఆడాల్సింది. కానీ మేము అలా చేయలేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. మొదటి టైమ్​ ఔట్​ బ్రేక్​ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయాం. కెయిల్​ మేయర్స్​, క్వింటన్ డికాక్​.. వీరిద్దరిలో ఎవర్ని ఆడించాలన్నిది కాస్త కఠినమైన నిర్ణయమే. అయితే, చెన్నైలో మేయర్స్​​కు మంచి రికార్డు ఉంది. దీంతో అలాంటి సమయాల్లో మేయర్స్​నే ఆడించాం. ఇక, మ్యాచ్​ ప్రారంభంలో స్పిన్నర్లను బరిలోకి దింపాం' అని చెప్పుకొచ్చాడు. అయితే, డికాక్​ స్థానంలో మేయర్స్​ను ఆడించడానికే లఖ్​నవూ జట్టు మొగ్గు చూపుతూ వస్తోంది. మేయర్స్​ను ఇంపాక్ట్​ ప్లేయర్​గా తీసుకుంటుండగా.. డికాక్​ ఐదుగురు సబ్​స్టిట్యూట్​లలో కూడా లేకపోవడం గమనార్హం.

లఖ్​నవూ ఓటమికి ఇవే కారణాలు..
బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం ఈ మ్యాచ్​లో లఖ్​నవూ కొంపముంచింది. ఒకే ఇన్నింగ్స్​లో మూగ్గురు రన్​ఔట్​ అయ్యారు. ఇందులో విచిత్రమేంటంటే.. ఈ మూడు రన్​ఔట్​లకు కారణం దీపక్​ హుడానే. మొదటి రెండు రన్​ఔట్లకు అతడే కారణమయ్యాడు. చివరకు తాను కూడా అలాగే పెవిలియన్ చేరాడు. ఇక, కేఎల్​ రాహుల్​ గాయం కారణంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు కృనాల్​ పాండ్య. లీగ్​ స్టేజ్​లో జట్టును బాగానే నడిపించినా.. కీలకమైన ఎలిమినేటర్​ మ్యాచ్​లో డికాక్ బదులు మేయర్స్​ను ఆడించటం దెబ్బతీసింది. దీంతోపాటు ఫామ్​లో లేని దీపక్​ హుడాకు అవకాశం ఇవ్వడం కూడా దానికి ఆజ్యం పోసింది. ఇక, టీమ్​లో పలుమార్లు మార్పులు చేయడం కూడా జట్టు​ను దెబ్బతీసింది. అయితే, గత సీజన్​లో కూడా క్వాలిఫయర్​లో అడుగుపెట్టింది లఖ్​నవూ జట్టు. కానీ ఫైనల్స్​కు చేరుకోలేకపోయింది.

Last Updated : May 25, 2023, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.