ETV Bharat / sports

IPL 2023 : విరాట్​ కోహ్లీ హాఫ్​ సెంచరీ.. దిల్లీ టార్గెట్ ఫిక్స్​.. ఎంతంటే? - ఐపీఎల్​ 2023 బెంగళూరు మ్యాచ్​

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా దిల్లీతో జరుగుతున్న మ్యాచ్​లో బెంగళూరు ఇన్నింగ్స్​ ముగిసింది. మరి దిల్లీ జట్టు టార్గెట్​ ఎంతంటే?

ipl 2023
ipl 2023
author img

By

Published : Apr 15, 2023, 5:12 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 16వ సీజన్​లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఇన్నింగ్స్​ ముగిసింది. 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. ప్రత్యర్థి దిల్లీకి 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బ్యాటరల్లో విరాట్​ కోహ్లీ టాప్​ స్కోరర్​గా నిలిచాడు. హాఫ్​ సెంచరీ సాధించాడు. దిల్లీ జట్టు బౌలర్లలో మిచెల్​ మార్ష్​, కుల్దీప్​ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. అక్షర్​ పటేల్​, లలిత్​ యాదవ్ చెరో ఒక వికెట్​ పడగొట్టారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్‌ శుభారంభం చేశారు. ఇద్దరూ బంతిని బౌండరీలను దాటించారు. మెరుపు షాట్లు ఆడారు. కానీ దూకుడుగా ఆడుతున్న ఆర్‌సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ (22)కు మిచెల్‌ మార్ష్‌ అడ్డుకట్ట వేశాడు. ఫోర్‌ కొట్టి ఊపు మీదున్న డుప్లెసిస్‌ మరో షాట్‌కు యత్నించాడు. అయితే మిడ్‌ వికెట్‌ స్థానంలో ఉన్న అమాన్‌ ఖాన్‌ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. డుప్లెసిస్ ఔటయ్యాక.. ఐపీఎల్​ కెరీర్​లో 47వ అర్ధ శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ (50; 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు. లలిత్‌ యాదవ్‌ వేసిన 10.1 ఓవర్‌కు డీప్‌ మిడ్‌ వికెట్‌లో యశ్‌ ధూల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన మహిపాల్.. మిచెల్ మార్ష్‌ వేసిన 13 ఓవర్‌లో రెండో బంతికి సిక్సర్‌ బాదాడు. తర్వాతి బంతికే వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పొరెల్‌కు మహిపాల్ లామ్రోర్‌ (26) క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మొదట అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దిల్లీ డీఆర్‌ఎస్‌కు వెళ్లడంతో అక్కడ వారికి సానుకూల ఫలితం వచ్చింది. అక్షర్‌ పటేల్ వేసిన 14 ఓవర్‌లో ఐదో బంతికి సిక్సర్‌ బాదిన హర్షల్ పటేల్ (6) తర్వాతి బంతికే వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పొరెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దూకుడుగా ఆడిన మ్యాక్స్‌వెల్ (24).. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన చక్కటి బంతికి డేవిడ్ వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్​ కీపర్​ దినేష్​ కార్తీక్​ నిరాశపరిచాడు. మొదటి బంతికే గోల్డెన్​ డక్​గావెనుదిరిగాడు. కుల్దీప్​ యాదవ్​ వేసిన బంతికి లలిత్​ యాదవ్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. షాబాజ్‌ అహ్మద్ (*), అనుజ్​ రావత్​ (15*) నాటౌట్​గా నిలిచారు. ఫలితానికి బెంగళూరు జట్టు 174 పరుగులు సాధించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.