ETV Bharat / sports

IPL 2023: వార్నర్ స్లో బ్యాటింగ్​.. అసలు ప్లాన్ ఇదేనంట! - warner slow batting

ఐపీఎల్ 2023లో వార్నర్​ మంచిగానే పరుగులు సాధిస్తున్నా.. కానీ స్లో బ్యాటింగ్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ స్లో బ్యాటింగ్​ చేయడానికి ఓ కారణం ఉందని క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే?

Delhi capitals David Warner
Delhi capitals David Warner
author img

By

Published : Apr 12, 2023, 1:30 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్(ఐపీఎల్​) అంటేనే క్రికెట్ ప్రేమికులకు గుర్తొచ్చేది బ్యాటర్ల ధనాధన్ ఇన్నింగ్స్​. వారు భారీ సిక్సర్లు, ఫోర్లతో విజృంభిస్తుంటే వచ్చే మజానే వేరు. క్రిస్ గేల్, రస్సెల్, పొలార్డ్, వార్నర్, కోహ్లీ, రాహుల్, రైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆటగాళ్లు ఈ జాబితాలోకి వస్తారు. అయితే వీరందరిలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్​ డేవిడ్ వార్నర్​ది ఓ ప్రత్యేక శైలి. ప్రస్తుత క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫార్మాట్​కు తగ్గట్టు ఆడుతూ పరుగులను తన ఖాతాలో వేసుకుంటుంటాడు. ఐపీఎల్​లోనూ తన బ్యాటింగ్​ స్టైల్​తో బెస్ట్ బ్యాటర్​ మంచి ఫ్యాన్​ బేస్​ను క్రియేట్​ చేసుకున్నాడు. ఈ మెగాలీగ్​లో కొన్ని రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.

అయితే ప్రస్తుత సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు వార్నర్.​ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ దిల్లీ జట్టు ఓడిపోయి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ఈ నాలుగు మ్యాచుల్లోనూ మూడింటిలో వార్నర్​ హాఫ్​ సెంచరీలతో అదరగొట్టడం విశేషం. కానీ ఇక్కడ ఓ విషయాన్ని గమనిస్తే.. అతడు పరుగులు చేస్తున్నాడు కానీ.. చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. దీంతో అతడు స్లో బ్యాటింగ్​ విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. సోషల్ ​మీడియా వేదికగా కొంచెం ట్రోల్స్​కు కూడా గురౌతున్నాడు.

గత నాలుగు మ్యాచుల గణాంకాలను పరిశీలిస్తే లఖ్​నవూతో జరిగిన మ్యాచులో 48 బంతుల్లో 56 పరుగులు, గుజరాత్ టైటాన్స్​తో జరిగిన మ్యాచులో 32 బంతుల్లో 37 పరుగులు, రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచులో 55 బంతుల్లో 65 పరుగులు, తాజాగా ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచులో 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ నాలుగు మ్యాచులు కలిసి అతడి స్టైక్​ రేట్​ 114.83గా ఉంది. కానీ ఈ ఫార్మాట్​ టీ20 అని గుర్తించాలి. ఐపీఎల్​లో తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేసేలా ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడాలి. అప్పుడే కదా టీమ్​కు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఈ స్లో బ్యాటింగ్​ వల్ల ఓటములకే ఎక్కువ ఛాన్స్​లు ఉంటాయి. అయితే వార్నర్ ఇలా నెమ్మదిగా ఆడటం వెనక ఓ ప్లాన్​ ఉన్నట్లు సోషల్​మీడియాలో క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ 2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. కాబట్టి ఇక్కడి పిచ్​లపై ఇప్పటికే డేవిడ్​ భాయ్​కు ఆడిన అనుభవం కూడా ఉంది. ఆ అనుభవాన్ని మరింతగా పెంచుకునేందుకు.. వార్నర్​ సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. అందుకే ఇలా నెమ్మదిగా ఆడుతూ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాడని చెప్పుకుంటున్నారు. ఫైనల్​గా వార్నర్​ పెద్ద ప్లానే వేశాడని కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడం వల్ల.. కనీసం తానైనా స్లోగా ఆడి ఔట్​ అవ్వకుండా క్రీజులో ఉండాలని అలా అడుతున్నాడని అంటున్నారు.

ఇదీ చూడండి: IPL 2023: వరుస మ్యాచులు ఓడినా.. వార్నర్​ సరికొత్త రికార్డు.. తొలి క్రికెటర్​గా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.