ETV Bharat / sports

IPL 2023: సీఎస్కే మ్యాచ్​తో అర్జున్ ఐపీఎల్​ ఎంట్రీ! - సీఎస్కే ముంబయి ఇండియన్స్ మ్యాచ్​

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023లో భాగంగా తమ రెండో మ్యాచ్​ను సీఎస్కేతో ఆడనుంది ముంబయి ఇండియన్స్​. మరి కొన్ని గంటల్లో ఈ మ్యాచ్​ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్​తో సచిన్​ తనయుడు అర్జున్​ ఐపీఎల్ అరంగేట్రం ఇస్తాడని తెలుస్తోంది. ఆ వివరాలు..

arjun ipl entry
అర్జున్​ ఐపీఎల్ అరంగేట్రం
author img

By

Published : Apr 8, 2023, 12:02 PM IST

Updated : Apr 8, 2023, 1:03 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023లో తమ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది ముంబయి ఇండియన్స్​. అయితే ఇప్పుడు తమ రెండో మ్యాచైన కీలక పోరుకు సిద్ధమైంది. నేడు(శనివారం) వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని రోహిత్‌ సేన పట్టుదలతో ఉంది. అయితే ఈ పోరులో పలు మార్పులతో ముంబయి బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.

చెన్నై సూపర్​ కింగ్స్​తో మ్యాచ్‌కు ముందు నెట్​ ప్రాక్టీస్​లో ముంబయి పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ గాయపడినట్లు తెలుస్తోంది. అతడు మ్యాచ్​కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ అనుకున్నట్టే అతడు మ్యాచ్‌కు దూరమైతే ఆ స్థానంలో మెరిడిత్‌ టీమ్​లోకి వచ్చే ఛాన్స్​ ఉంది. ఇక యంగ్​ స్పిన్నర్‌ హృతిక్ షోకిన్ ప్లేస్​లో కుమార్‌ కార్తీకేయకు అవకాశం ఇవ్వాలని ముంబయి మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అర్జున్‌ తెందుల్కర్​ ఎంట్రీ ఛాన్స్​.. మరోవైపు దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్​ తనయుడు అర్జున్‌ తెందుల్కర్​ చెన్నై సూపర్​ కింగ్స్​తో మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో ముంబయి ఇండియన్స్‌ టీమ్​లో జాయిన్​ అయిన అతడు.. కనీసం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​లో కూడా ఆడలేదు. యాజమాన్యం అతడికి ఇంకా అవకాశం ఇవ్వలేదు. అయితే తాజా మ్యాచ్‌కు ముందు అతడు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో వస్తున్నాయి. దీంతో అర్జున్‌ ఐపీఎల్‌ ఎంట్రీ ఖాయమైనట్లు ముంబయి ఇండియన్స్​ ఫ్యాన్స్​ అనుకుంటున్నారు. ఇకపోతే దేశవాళీ క్రికెట్‌లో గోవా తరపున అర్జున్‌ ఆడుతున్నాడు. రంజీ సీజన్‌ 2022-23లో అర్జున్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తన తొలి మ్యాచ్​లోనే శతకంతో మెరిశాడు. ఇప్పటివరకు 7 లిస్ట్​-ఏ మ్యాచులు ఆడి 25 వికెట్లు, ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 9 వికెట్లు​, 9 టీ20 మ్యాచులు ఆడి 12 వికెట్లు తీశాడు.

కాగా, ముంబయి తన తొలి మ్యాచ్​లో ఆర్సీబీపై.. పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ నిరాశపరిచారు. అలా 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబయిని తిలక్‌ వర్మ (84 నాటౌట్‌; 46 బంతుల్లో 9×4, 4×6) ఆదుకుని విధ్వంసం సృష్టించాడు. దీంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 రన్స్​ చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది బెంగళూరు.

ఇదీ చూడండి: అల్లు అర్జున్​తో పంజాబ్​ కింగ్స్​ ప్లేయర్స్.. వైరల్​గా​​ కావ్య పాప రియాక్షన్‌!

Last Updated : Apr 8, 2023, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.