క్రికెట్లో ఏ ఫార్మట్‌లో అయినా బ్యాటింగ్‌తో సమానంగా బౌలింగ్ ప్రదర్శన కూడా ఉండాలి. అప్పుడే ఆడే ప్లేయర్స్‌తో పాటు చూసే అభిమానులకు ఆ గేమ్ ఉత్కంఠంగా ఉంటుంది. టీ20 అంటేనే ధనాధన్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అని అందరూ అంటుంటారు. ఇక మైదానంలోకి వచ్చే క్రికెటర్లు కూడా వీలైతే ఫోర్లు, సిక్సులతో చెలరేగిపోతుంటారు. మరోవైపు బ్యాటర్ దూకుడికి బౌలర్లు బెంబేలెత్తిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
త్వరలో ఐపీఎల్ సీజన్ ఆరంభం కానుంది. ఈ ఫార్మాట్లో క్రికెటర్ల జోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ షాట్లతో చెలరేగిపోయే ఈ మ్యాచుల్లో డాట్ బాల్స్ వేయడం అనేది కొంచం రిస్క్‌తో కూడిన పని అని చెప్పాలి. కనీసం వంద డాట్ బాల్స్ వేయడం కూడా కష్టమే అని విశ్లేషకులు అంటుంటారు. కానీ, టీమ్ఇండియా ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఏకంగా 1,406 డాట్ బాల్స్ వేసి రికార్డుకెక్కాడు. అలా ఈ ఫార్మాట్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 146 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్.. దాదాపు 542 ఓవర్లు వేశాడు. అందులో దాదాపు 1,406 డాట్ బాల్స్ ఉండటం గమనార్హం. అన్నీ ఐపీఎల్ సీజన్స్‌లోనూ భువనేశ్వర్ ఇప్పటివరకు 154 వికెట్లను పడగొట్టాడు.
మరోవైపు, అత్యధిక డాట్ వేసిన బౌలర్ల లిస్ట్‌లో భువనేశ్వర్ తర్వాత పొజిషన్లో సునీల్ నరైన్ ఉన్నాడు. ఆయన 1,391 డాట్ బాల్స్ వేసి రికార్డుకెక్కాడు. ఇక టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 1,387 డాట్ బాల్స్ వేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో మాజీ ప్లేయర్స్ హర్భజన్ సింగ్, లసిత్ మలింగ ఉన్నారు. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు పూణే వారియర్స్ తరఫున ఆడిన భువనేశ్వర్.. ఆ తర్వాత 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోకి చేరాడు. అప్పటి నుంచి సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాడు. అంతే కాకుండా సన్‌రైజర్స్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ కొనసాగుతున్నాడు.
కాంట్రాక్ట్ లిస్ట్‌లో భువికి నో ప్లేస్..
2023కు గాను రిలీజ్ చేసిన కాంట్రాక్ట్ లిస్ట్‌లో భువనేశ్వర్ కుమార్ పేరును తొలగించింది బీసీసీఐ. భువనేశ్వర్‌తో పాటు అజింక్య రహానే, ఇషాంత్ శర్మను కూడా తొలగించింది. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భువనేశ్వర్‌ను భారత సెలక్టర్లు పక్కన పెట్టడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.