ETV Bharat / sports

IPL 2023 : సూర్య వీర విహారం.. గుజరాత్​పై ముంబయి విజయం - surya kumar century

IPL 2023 MI vs GT : ఐపీఎల్​లో భాగంగా గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. సూర్యకుమార్​ యాదవ్(103 నాటౌట్‌; 49 బంతుల్లో 11×4, 6×6)​ వీరబాదుడుతో జట్టు విజయం సాధించింది. మరోవైపు బాల్​తో పాటు బ్యాటింగ్​లో రాణించిన రషీద్​ ఖాన్​ (79 నాటౌట్‌; 32 బంతుల్లో 3×4, 10×6) ఇన్నింగ్స్​ వృథా అయిపోయాయి.

Mumbai Indians vs Gujarat Titans
Mumbai Indians vs Gujarat Titans
author img

By

Published : May 12, 2023, 11:03 PM IST

Updated : May 13, 2023, 6:24 AM IST

IPL 2023 MI vs GT : ఈ సీజన్​లో లేటుగా పుంజుకుని 200 లక్ష్యాలను ఛేదిస్తూ టోర్నీలో ముందుకెళ్తున్న ముంబయి ఇండియన్స్​.. ఈసారి ఫస్ట్​ బ్యాటింగ్‌ చేస్తూ ఆ మార్క్​ను దాటింది. శుక్రవారం సూర్యకుమార్‌ యాదవ్‌ (103 నాటౌట్‌; 49 బంతుల్లో 11×4, 6×6) వీరబాదుడు బాదడంతో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబయి.. గుజరాత్‌ టైటాన్స్​ను 191/8కు కట్టడి చేసింది. ఫలితంగా 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి.. 191 పరుగులు మాత్రమే చేసింది. నాలుగు వికెట్లతో మెరిసిన రషీద్‌ ఖాన్‌.. బ్యాటింగ్​లోనూ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి 32 బంతుల్లో 10 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 79 పరుగులు చేసినపప్పటికీ గుజరాత్‌ జట్టు.... లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అతను కాకుండా మిల్లర్‌ (41; 26 బంతుల్లో 4×4, 2×6) మెరిశాడు. ముంబయి బౌలర్లలో ఆకాశ్‌ మధ్వాల్‌ (3/31), చావ్లా (2/36), కార్తికేయ (2/37) గుజరాత్‌ను దెబ్బ తీశారు. 12 మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కిది నాలుగో ఓటమి కాగా.. ముంబయి ఏడో విజయంతో ప్లేఆఫ్స్‌కు చేరువైంది. సూర్యకుమార్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ముంబయి ఇన్నింగ్స్​.. అంతకుముందు, టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన రోహిత్​ సేన నిర్ణీత 20 ఓవర్లో 218/5 భారీ స్కోర్​ను సాధించింది. సూర్యకుమార్ యాదవ్​(103*; 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్​లు) సెంచరీ బాదేశాడు. ఇషాన్​ కిషన్​ (31), రోహిత్​ శర్మ (29), నెహాల్​ వధేరా (15), విష్ణు వినోద్​ (30), టిమ్​ డేవిడ్ ​(5), కామెరూన్​ గ్రీన్​ (3) పరుగులు చేశారు. దీంతో గుజరాత్​ ముందు 219 పరుగుల టార్గెట్​ను నిర్దేశించింది ముంబయి ఇండియన్స్. గుజరాత్​ బౌలర్లు రషీద్​ ఖాన్ 4 వికెట్లు, మోహిత్​ శర్మ ఒక వికెట్​ తీశారు.

రోహిత్​ శర్మ నాయ రికార్డు.. గత ఐదు మ్యాచ్​ల నుంచి విఫలమవుతున్న రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్​లో తేరుకున్నాడు. 18 బంతుల్లో 29 పరగులు చేసి రాణించాడు. రెండు సిక్స్​లు, 3 ఫోర్లతో ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడాడు. దీంతో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 252 సిక్స్​లు బాది.. ఐపీఎల్​ చరిత్రలోనే రెండో అత్యధిక సిక్స్​లు కొట్టిన ప్లేయర్​గా నిలిచాడు. 251 సిక్స్​లతో ఇప్పటివరకు ఈ ప్లేస్​లో ఉన్న ఏబీ డెవిలియర్స్​ను వెనక్కు నెట్టాడు. ప్రస్తుతం 357 సిక్స్​లతో క్రిస్​ గేల్​ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

ముంబయి తొలి సెంచరీ.. ఈ మ్యాచ్​లో ముంబయి ప్లేయర్​ సూర్య కుమార్​యాదవ్ (103*) సెంచరీ బాదాడు. 2014 తర్వాత ముంబయి ఇండియన్స్​ ఆటగాడు శతకం సాధించడం ఇదే మొదటిసారి. దాదాపు 10 పదేళ్లుగా ఐమ్​ఐ బ్యాటర్​ సెంచరీ నమోదు చేయకపోవడం విశేషం.

ఇదీ చూడండి: వన్డే వరల్డ్​కప్​ వస్తోంది.. వీరిపై కన్నేయండి.. బీసీసీఐకి మాజీల సూచన

Last Updated : May 13, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.