KKR Vs PBKS : సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా మెరిసింది. 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. శిఖర్ ధావన్ రాణించడం వల్ల మొదట పంజాబ్ 7 వికెట్లకు 179 పరుగులను స్కోర్ చేసింది. వరుణ్ చక్రవర్తి ఆ జట్టును కట్టడి చేశాడు. కెప్టెన్ నితీశ్ రాణా జేసన్ రాయ్, రసెల్, రింకూ సింగ్ మెరవడం వల్ల లక్ష్యాన్ని కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇక కోల్‌కతా ఛేదనలో ఆ జట్టు కెప్టెన్ నితీశ్ రాణా, రసెల్ ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. రాణా కీలక ఇన్నింగ్స్‌తో జట్టును పోటీలో నిలిపితే.. ఆఖర్లో పరిస్థితులు క్లిష్టంగా మారిన సమయంలోనూ రసెల్ తన అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ఓపెనర్ జేసన్ రాయ్ ధనాధన్ బ్యాటింగ్‌తో కోల్‌కతాకు ఓ మంచి ఆరంభమే దక్కింది. 7 ఓవర్లలో 63/1. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా నిలిచినా.. స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. కానీ లివింగ్‌స్టన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో నితీశ్ జోరందుకున్నాడు. అయ్యర్‌ది మాత్రం అదే పరిస్థితి. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ పోయింది. ఒత్తిడిలో ముందుకొచ్చి ఆడబోయిన అయ్యర్.. చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
చివరి ఐదు ఓవర్లలో 58 రన్స్ అవసరం కాగా.. నితీశ్ రాణా కూడా ఔట్ కావడం వల్ల లక్ష్యం కోల్‌కతాకు క్లిష్టంగా మారింది. అయితే రసెల్, రింకూ బ్యాట్ ఝుళిపించడం వల్ల చివరి రెండు ఓవర్లలో కోల్‌కతాకు 26 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఒక్కసారిగా విరుచుకుపడ్డ రసెల్.. సామ్ కరన్ ఓవర్లో మూడు సిక్స్‌లు బాదేసి మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పేశాడు. చివరి ఓవర్లో 6 పరుగులే అవసరమైనా.. అర్ష్‌దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. అతడు తొలి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులే ఇచ్చాడు. అయిదో బంతికి రసెల్ రనౌటయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరంగా కాగా.. అర్ష్‌దీప్ ఫుల్‌టాస్‌ను రింకూ అలవోకగా బౌండరీ దాటించడం వల్ల కోల్‌కతా సంబరాల్లో మునిగిపోయింది.
పంజాబ్‌కు వరుణ్ కళ్లెం
చక్రవర్తి సూపర్ బౌలింగ్‌తో అంతకుముందు పంజాబ్ కింగ్స్‌ను కోల్‌కతా కట్టడి చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్ దూకుడుగానే ఆరంభమైనప్పటికీ అది చాలా కొద్దిసేపటికే. ఆ జట్టు 29 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ కెప్టెన్ శిఖర్ ధావన్ అర్ధసెంచరీ సాధించినా.. ఆటలో వాడి లోపించింది. అయితే ఆఖర్లో బ్యాటర్ల మెరుపులకు పంజాబ్ కాస్త మెరుగైన స్కోరును సాధించగలిగింది.
IPL 2023 KKR Vs PBKS : టాస్ గెలిచి పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ తొలి ఓవర్లోనే మూడు ఫోర్లను బాదేశాడు. కానీ తర్వాతి ఓవర్లో అతడు, నాలుగో ఓవర్లో రాజపక్స ఔటయ్యారు. దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ ధావన్ చక్కని బౌండరీలు సాధించాడు. మరోవైపు రసెల్ బౌలింగ్‌లో లివింగ్‌స్టన్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. కానీ అతడు ఎక్కువసేపు నిలవలేకపోవడంతో పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్ 58/3తో నిలిచింది. ఆ తర్వాత ధావన్.. జితేశ్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను కాస్త జోరుగా నడిపించాడు. కానీ దూకుడుగా ఆడలేకపోయాడు. జితేశ్ శర్మ కూడా అంతే. దీంతో స్కోరు బోర్డు నెమ్మదిగా సాగింది.
వరుణ్ చక్రవర్తితో పాటు ఇతర స్పిన్నర్లైన నరైన్, సుయాశ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 12వ ఓవర్లో నరైన్ బౌలింగ్‌లో ధావన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పంజాబ్ స్కోరు 100 దాటింది. కానీ తర్వాతి ఓవర్లోనే జితేశ్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయడంతో 53 పరుగుల నాలుగో వికెట్‌కు భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లలో శిఖర్ ధావన్, రిషి ధావన్, సామ్ కరన్ వికెట్లు కూడా కోల్పోయిన పంజాబ్.. 18 ఓవర్లు ముగిసే సరికి 143/7తో నిలిచింది.
కానీ చివరి రెండు ఓవర్లలో బ్యాటర్లు అనూహ్యంగా చెలరేగడం వల్ల ఆ జట్టు సంతృప్తిగా ఇన్నింగ్స్‌ను ముగించింది. హర్‌ప్రీత్ బ్రార్ రెండు ఫోర్లు, షారుక్ ఖాన్ ఫోర్ కొట్టడంతో 19వ ఓవర్లో అరోరా 15 పరుగులివ్వగా.. ఆఖరి ఓవర్లో హర్షిత్ రాణా ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో షారుక్ వరుసగా 6, 4, 4 బాదగా.. హర్‌ప్రీత్ ఓ ఫోర్ కొట్టాడు. వరుణ్ చక్రవర్తి (3/26) గొప్పగా బౌలింగ్ చేశాడు.