ఎట్టకేలకు దిల్లీ క్యాపిటల్స్ గెలుపు రుచి చూసింది. గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. వర్షం వల్ల ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో తొలుత కోల్‌కతా తడబడింది. ఇషాంత్, నోకియా, అక్షర్, కుల్‌దీప్ ధాటికి 20 ఓవర్లలో 127 పరుగులకే అందరూ పెవిలియన్ చేరుకున్నారు. జేసన్ రాయ్ (43), రసెల్ (38) బ్యాటుతో మైదానంలో గట్టిగా రాణించారు. వార్నర్ (57); మెరుపులకు అక్షర్ పటేల్ (19) పోరాటం తోడవ్వడం వల్ల.. నిర్దిష్ట లక్ష్యాన్ని దిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కోల్‌కతా బ్యాటర్లు తడబడినప్పటికీ అదే పిచ్‌పై వార్నర్ అలవోకగా ఆడటం వల్ల దిల్లీ గెలవడం తేలికే అనిపించింది. 7 ఓవర్లలోనే స్కోరు 62/1గా నమోదు కాగా.. ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిన వార్నర్... ఎడాపెడా బౌండరీలను బాదేశాడు. నరైన్ ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టి స్టేడియం దద్దరిల్లేలా చేశాడు. అయితే సాఫీగా విజయం దిశగా సాగుతున్నట్లనిపించిన దిల్లీ.. అనూహ్యంగా చెమటోడ్చాల్సి వచ్చింది. అయిదు పరుగుల సమయంలోనే మార్ష్ (2), సాల్ట్ (5)ను ఔటయ్యారు. ఆ తర్వాత మనీశ్ పాండేతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
14వ ఓవర్లో జట్టు స్కోరు 93 ఉండగా.. అదే సమయంలో వార్నర్ ఔటవ్వడం వల్ల దిల్లీపై కాస్త ఒత్తిడి పెరిగింది. పాండే, అక్షర్ పటేల్ నిలవగా 15.4 ఓవర్లలో 110/4తో లక్ష్యానికి చేరువైంది దిల్లీ. పాండే (21), అమన్ హకీమ్ వికెట్లు కోల్పోగా.. వీరికి గెలుపు బాటలో పయనించేందుకు మరింత కష్టంగా మారింది. అక్షర్, లలిత్‌కు సింగిల్స్ తీయడం కూడా చాలా కష్టమైపోయింది. ఓ దశలో 6 వికెట్లు చేతిలో ఉండగా 30 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉన్న దిల్లీ.. చివరి రెండు ఓవర్లలో 12 చేయాల్సిన స్థితికి వచ్చింది. తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ లలిత్‌తో కలిసి అక్షర్.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా పని పూర్తి చేశాడు.
ఇషాంత్ శర్మ రీఎంట్రీ అదుర్స్.. ఐపీఎల్ రీఎంట్రీని ఘనంగా ఆరంభించాడు ఇషాంత్ శర్మ. దాదాపు 717 రోజుల తర్వాత ఈ మెగాటోర్నీ మ్యాచ్ ఆడిన ఇషాంత్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా, అతడిని ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో దిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. అతడు 2021లో చివరిసారి దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 93 మ్యాచుల్లో 71 వికెట్లు తీశాడు.
ఇదీ చూడండి: IPL 2023 RCB VS PBKS : సిరాజ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్.. రొనాల్డోలా సెలబ్రేషన్స్!