IPL 2022 best catches 2022: ఐపీఎల్ 2022 మెగా లీగ్‌లో 23 మ్యాచ్‌లు ముగిశాయి. బ్యాటర్ల సిక్సర్ల మోత, బౌలర్ల వికెట్ల వేట.. ఫీల్డింగ్‌లో అద్భుత విన్యాసాలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. బౌలర్లు తమ మాయాజాలంతో బ్యాటర్లను కట్టడి చేస్తుంటే.. తమ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లనే మలుపుతిప్పుతున్నారు కొందరు ఫీల్డర్స్. అసాధ్యం అనుకున్న క్యాచ్‌లను సైతం ఒంటి చెత్తో ఒడిసిపట్టి ఔరా అనిపిస్తున్నారు. బెస్ట్ క్యాచ్‌లు అందుకున్న సందర్భాలు కొన్ని మీకోసం.
అంబాటి రాయుడు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబాటి రాయుడు అద్భుతమైన క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. 16వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతి బౌన్స్ అయి ఆర్సీబీ ఆటగాడు ఆకాశ్ దీప్ బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. షార్ట్ ఎక్స్ట్రా కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న రాయుడి అద్భుత డైవింగ్‌తో ఒంటి చేత్తో గాల్లోని బంతిని పట్టుకున్నాడు. మూడు వేళ్లతోనే బాల్‌ను పట్టుకుని మోచేతిపై శరీరాన్ని బ్యాలెన్స్ చేసి ఆకాశ్ దీప్‌ను పెవీలియన్ చేర్చిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
-
Ambati Rayudu Just took the catch of the season #Rayudu #CSKvsRCB #IPL2022 #Cskforever @roydoaumbeti pic.twitter.com/ukI9ynwBXK
— Mr.shaun❤🇮🇳 (@Shaun81172592) April 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ambati Rayudu Just took the catch of the season #Rayudu #CSKvsRCB #IPL2022 #Cskforever @roydoaumbeti pic.twitter.com/ukI9ynwBXK
— Mr.shaun❤🇮🇳 (@Shaun81172592) April 12, 2022Ambati Rayudu Just took the catch of the season #Rayudu #CSKvsRCB #IPL2022 #Cskforever @roydoaumbeti pic.twitter.com/ukI9ynwBXK
— Mr.shaun❤🇮🇳 (@Shaun81172592) April 12, 2022
కుల్దీప్ యాదవ్: దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఈ సీజన్లో అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రెండేళ్ల తర్వాత క్రికెట్ ఆడుతున్న కుల్దీప్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచ్ నంబర్ 19లో తన సొంత బౌలింగ్‌లో అందుకున్న సెన్సేషనల్ క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. 16వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ బ్యాటింగ్ చేస్తుండా బౌలింగ్ చేశాడు కుల్దీప్ యాదవ్. బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ఉమేశ్ బ్యాట్ టాప్ఎడ్జ్కు తగిలి అక్కడే గాల్లోకి లేచింది బంతి. ఇన్నర్ సర్కిల్లో ఫీల్డర్ లేడని గమనించిన కుల్దీప్ వేగంగా వెళ్లి డైవ్ చేస్తూ బంతిని ఒడిసిపట్టాడు. మరోవైపు.. కెప్టెన్ రిషబ్ పంత్ వేగంగా వచ్చినా.. అతడికి వదిలేయకుండా కుల్దీప్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ వైరల్‌గా మారింది.
-
What a catch by Kuldeep Yadav pic.twitter.com/aWXZZzYg59
— That-Cricket-Girl (@imswatib) April 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a catch by Kuldeep Yadav pic.twitter.com/aWXZZzYg59
— That-Cricket-Girl (@imswatib) April 10, 2022What a catch by Kuldeep Yadav pic.twitter.com/aWXZZzYg59
— That-Cricket-Girl (@imswatib) April 10, 2022
రాహుల్ త్రిపాఠి: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అందుకున్న క్యాచ్ ఆ మ్యాచ్‌తో పాటు లీగ్‌కే హైలైట్‌గా మారింది. టైటాన్స్ బ్యాంటింగ్ మూడో ఓవర్ భువనేశ్వర్ కుమార్ వేశాడు. ఔట్‌సైడ్ ఆఫ్‌లో లెంగ్త్ బాల్ వేశాడు భూవి. దానిని శుభమన్ గిల్ బౌండరికి తరలించేందుకు బలంగా కొట్టాడు. అంతా బౌండరీకి వెళ్లిపోయిందని భావించారు. కానీ, ఇన్సైడ్ సర్కిల్లో ఉన్న రాహుల్ త్రిపాఠి అద్భుత డైవ్‌తో కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. త్రిపాఠి క్యాచ్ అందుకోవటంతో మైదానం మొత్తం అతడి పేరు మారుమోగిపోయింది.
-
Rahul tripathi stunning catch... #GTvsSRH #SRHvGT pic.twitter.com/UA0focDkgi
— Chinthakindhi Ramudu (O- Negitive) (@RAMURAVANA) April 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rahul tripathi stunning catch... #GTvsSRH #SRHvGT pic.twitter.com/UA0focDkgi
— Chinthakindhi Ramudu (O- Negitive) (@RAMURAVANA) April 11, 2022Rahul tripathi stunning catch... #GTvsSRH #SRHvGT pic.twitter.com/UA0focDkgi
— Chinthakindhi Ramudu (O- Negitive) (@RAMURAVANA) April 11, 2022
శుభమన్ గిల్: ఈ సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో తన ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమన్ గిల్. తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. వరుణ్ అరోన్ బౌన్సర్ విసరగా.. ఎల్ఎస్జీ అటగాడు ఎవిన్ లేవిస్ పుల్‌షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ మిడిల్ కాకపోవటం వల్ల బంతి గాల్లోకి లేచింది. మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న శుభమన్ వేగంగా పరుగెత్తి అద్భుతమై డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు.
-
CATCH THAT, Shubman 👏👏
— IndianPremierLeague (@IPL) March 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ICYMI - An outstanding leaping catch from @ShubmanGill that ended Evin Lewis's stay out there in the middle.
Full video 📽️📽️https://t.co/le0ebbkUdw #TATAIPL #GTvLSG pic.twitter.com/90Sq0Qkdrt
">CATCH THAT, Shubman 👏👏
— IndianPremierLeague (@IPL) March 28, 2022
ICYMI - An outstanding leaping catch from @ShubmanGill that ended Evin Lewis's stay out there in the middle.
Full video 📽️📽️https://t.co/le0ebbkUdw #TATAIPL #GTvLSG pic.twitter.com/90Sq0QkdrtCATCH THAT, Shubman 👏👏
— IndianPremierLeague (@IPL) March 28, 2022
ICYMI - An outstanding leaping catch from @ShubmanGill that ended Evin Lewis's stay out there in the middle.
Full video 📽️📽️https://t.co/le0ebbkUdw #TATAIPL #GTvLSG pic.twitter.com/90Sq0Qkdrt
లియమ్ లివింగ్‌స్టోన్: ఈ సీజన్ 11వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్‌లో 30 బాల్స్‌లోనే 60 పరుగులు సాధించాడు పంజాబ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైని కట్టడి చేయటంలో తనవంతు పాత్ర పోషించాడు. అద్భుత క్యాచ్ అందుకుని డ్వేన్ బ్రావోను తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగేలా చేశాడు. లివింగ్‌స్టోన్ ఓవర్లో చివరి బంతిని బ్రావో డిఫెండ్ చేద్దామనుకున్నాడు. అనుకోకుండా బాల్‌ను బలంగా కొట్టాడు. గాల్లోకి లేచిన బంతిని మెరుపువేగంతో స్పందించి ఒంటి చేత్తో అందుకుని బ్రావోను కాటన్బౌల్డ్ చేశాడు లివింగ్‌స్టోన్.
ఇదీ చూడండి: హైఓల్టేజ్ మ్యాచ్.. రాజస్థాన్ జోరుకు గుజరాత్ బ్రేకులు వేస్తుందా?