ETV Bharat / sports

IPL 2022: చెలరేగిన కేన్​ మామ.. సన్​రైజర్స్​ ఘన విజయం

IPL 2022 SRH Vs GT: ఐపీఎల్​ 2022 సీజన్​లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టుకి హైదరాబాద్‌ షాకిచ్చింది. ఆ జట్టుపై సన్​రైజర్స్​ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్​ విలియమ్సన్​ అర్ధ శతకంతో చెలరేగాడు.

author img

By

Published : Apr 11, 2022, 11:24 PM IST

Updated : Apr 11, 2022, 11:29 PM IST

IPL 2022 SRH VS GT
IPL 2022 SRH VS GT

IPL 2022 SRH Vs GT: ఐపీఎల్​ 15వ సీజన్​లో భాగంగా గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​​ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని సన్​రైజర్స్​ 19.1 ఓవర్లలో వికెట్లు కేవలం 2 కోల్పోయి ఛేదించింది. 163 పరుగుల లక్ష్యంతో దిగిన సన్​రైజర్స్​ జట్టు ఓపెనర్ అభిషేక్​ శర్మ(42) మెరిశాడు. మరో ఓపెనర్​ కేన్​ విలియమ్సన్​(57) అర్ధ శతకంతో చెలరేగాడు. రాహుల్ త్రిపాఠీ (17) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. బ్యాటర్లు నికోలస్​ పూరన్​(34), మార్​క్రమ్(12) నాటౌట్​గా నిలిచారు. గుజరాత్​ బౌలర్లలో రషీద్​ ఖాన్, హార్దిక్​​ పాండ్య​ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ టైటాన్స్​.. నిర్ణీత 20 ఓవర్లలో 162/7 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (50*) అర్ధ శతకంతో చెలరేగాడు. అభినవ్ మనోహర్ (35) రాణించాడు.​ ఓపెనర్ మ్యాథ్యూ వేడ్ (19)ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్​ల్లో అదరగొట్టిన శుభ్​మన్ గిల్ (7) ఈసారి నిరాశపరిచాడు. హైదరాబాద్​ బౌలర్లలో భువనేశ్వర్ 2, నటరాజన్ 2, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు

ఇదీ చదవండి: టీమ్​ఇండియాకు అతడు 100 టెస్టులు ఆడేలా చేస్తా: పాంటింగ్

Last Updated : Apr 11, 2022, 11:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.