Rohit Sharma hugs fan: ప్రస్తుత ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌ను వరుస ఓటములు వెంటాడుతున్నాయి. ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ముంబయి 9వ స్థానంలో ఉండగా.. ఆర్సీబీ హ్యాట్రిక్ విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో తన హుందాతనంతో ప్రశంసలు అందుకున్నాడు ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు హిట్ మ్యాన్. అదే సమయంలో సెక్యూరిటీ కళ్లు గప్పి ఓ అభిమాని రోహిత్ వైపు దూసుకొచ్చాడు. హగ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. మామూలు రోజుల్లో రోహిత్ ఇచ్చేవాడేమో? అయితే కరోనా నేపథ్యంలో కాస్త పరిణతితో ఆలోచించాడు.
ఆ అభిమాని తనవైపు వస్తుండటం చూసి.. మైదానం వెళ్లిపోవాలని అతడికి సూచించాడు. అతడు మాత్రం హగ్ కోసం రోహిత్ వైపే వెళ్తున్నాడు. అయితే ఇది కరోనా టైం అని.. వర్చువల్ హగ్ ఇస్తున్నట్లు చేతులు చాచాడు. ఆ ఫ్యాన్ కూడా చేతులు చాచి ఆనందంగా వెనక్కివెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అభిమానిని రోహిత్ డీల్ చేసిన విధానం చూసి ఫిదా అయ్యాడు. రోహిత్ వైపు చూసి క్లాప్స్ కొడుతూ అభినందిస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
Rohit Sharma's fan entered in the field .#RohitSharma𓃵 #ViratKohli𓃵 #RCBvMI #fan pic.twitter.com/Za1a6OgTmg
— Trending Cric Zone (@NaitikSingh28) April 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rohit Sharma's fan entered in the field .#RohitSharma𓃵 #ViratKohli𓃵 #RCBvMI #fan pic.twitter.com/Za1a6OgTmg
— Trending Cric Zone (@NaitikSingh28) April 9, 2022Rohit Sharma's fan entered in the field .#RohitSharma𓃵 #ViratKohli𓃵 #RCBvMI #fan pic.twitter.com/Za1a6OgTmg
— Trending Cric Zone (@NaitikSingh28) April 9, 2022
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. స్వల్పలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి చక్కని శుభారంభం లభించింది. డుప్లెసిస్ త్వరగానే వెనుదిరిగినా.. అనుజ్ రావత్(66), కోహ్లీ(48) రాణించారు. ముంబయి తన తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 13న పంజాబ్‌తో తలపడనుంది. ఏప్రిల్ 12న చెన్నైతో ఆడనుంది బెంగళూరు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఐపీఎల్ 2022 సీజన్‌ను కఠినమైన బయోసెక్యూర్ బబుల్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తోంది. ఆటగాళ్లే కాదు.. వారి కుటుంబ సబ్యులు, మ్యాచ్ అధికారులు, కోచింగ్ స్టాఫ్ ఇలా అందరూ ఈ బబుల్‌లోనే ఉన్నారు. కరోనా పరీక్షలు, క్వారంటైన్ తర్వాతే.. ఈ బయోబబుల్‌లోకి ప్రవేశించాలి.
ఇవీ చూడండి: ముంబయికి కలిసిరాని మెగా ఆక్షన్.. గతంలోనూ వరుస ఓటములు