ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు(csk win) నాలుగో టైటిల్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(dhoni csk).. ఆ జోష్‌లో ఉన్నాడు. అయితే అతడు వచ్చే సీజన్లో ఆడతాడా లేదా అని ప్రేక్షకులు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. మహీ కూడా దీని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు. బీసీసీఐ(bcci news) రిటెన్షన్ పాలసీ బట్టి తను ఆడేది ఆధారపడి ఉంటుందని అన్నాడు. కానీ ఇప్పుడు చెన్నై ఫ్యాన్స్‌కు స్వీట్ లాంటి వార్త చెప్పింది సీఎస్కే మేనేజ్మెంట్.
"వచ్చే సీజన్ కోసం రిటెన్షన్ ఉంది. అది నిజమే. అయితే ఎంతమందిని మళ్లీ తీసుకోవచ్చనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ధోనీనే మా తొలి ప్రాధాన్యం. ఈ షిప్‌కు కెప్టెన్ ఉండాల్సిందే. కచ్చితంగా చెబుతున్నా అతడు వచ్చే ఏడాది కూడా ఆడతాడు" అని చెన్నై సూపర్‌కింగ్స్ మెంబర్ ఒకరు చెప్పారు.
ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్(ipl final) ఫైనల్లో విజేతగా నిలిచిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ధోనీ(dhoni csk).
"ఇంతకు ముందే చెప్పా. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ఐపీఎల్లో నేను ఆడేది లేనిది బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కొత్తగా రెండు జట్లు వస్తున్నాయి. ఈ సమయంలో నా రిటైర్మెంట్ గురించి కాదు చెన్నై జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాను. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలవడం మాకు ముఖ్యం కాదు. ఏ సీజన్లోనూ ఇబ్బంది పడకుండా ఉండే ఆటగాళ్లు బృందాన్ని తయారు చేయడం ముఖ్యం. రాబోయే 10 ఏళ్ల కోసం చెన్నై జట్టులో ఉండే ఆటగాళ్ల కోసం మేం ప్రస్తుతం చూస్తున్నాం" అని మహీ(dhoni csk) చెప్పాడు.
మరోవైపు ధోనీ భార్య సాక్షి సింగ్(sakshi dhoni) ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. ఈ విషయాన్ని రైనా సతీమణి ప్రియాంక వెల్లడించింది. దీంతో మహీ అభిమానులు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ధోనీ-సాక్షి జంటకు 2010లో వివాహం జరగ్గా.. 2015లో జీవా సింగ్(ziva dhoni) జన్మించింది. జీవా అంటే మహీకి విపరీతమైన ప్రేమ. ఖాళీ దొరికినప్పుడల్లా తనతో ఎంతో సరదాగా గడుపుతుంటాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సాక్షి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
ఇవీ చదవండి: