ETV Bharat / sports

ఒకే ఒక్కడు 'షమి'.. 15 ఏళ్ల ఐపీఎల్​ చరిత్రలో అరుదైన రికార్డు - గుజరాత్​ టైటాన్స్​

Mohammed Shami Unique Record: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ ముగిసింది. పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన గుజరాత్​ టైటాన్స్​.. కప్పు ఎగరేసుకుపోయింది. టోర్నీ మొత్తం సమష్టిగా రాణించింది. ఈ క్రమంలోనే ఆ జట్టు స్టార్​ బౌలర్​ మహ్మద్​ షమి ఐపీఎల్​లోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదేంటంటే?

Mohammed Shami bags this unique record that no other player in 15-year IPL history ever had

author img

By

Published : Jun 1, 2022, 12:37 PM IST

Updated : Jun 1, 2022, 1:18 PM IST

Mohammed Shami Unique Record: ఐపీఎల్​-2022లో అద్భుతంగా రాణించిన గుజరాత్​ టైటాన్స్​ జట్టు అరంగేట్రంలోనే కప్పు కొల్లగొట్టింది. సమష్టిగా రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు ఆ జట్టు ఆటగాళ్లు. బ్యాటింగ్​లో కెప్టెన్​ హార్దిక్​ పాండ్య, మిల్లర్, శుభ్​మన్​ గిల్​ వెన్నెముకగా నిలిస్తే.. బౌలింగ్​లో మహ్మద్​ షమి, రషీద్​ ఖాన్​, యశ్​ దయాల్​ అదరగొట్టారు. షమి ముఖ్యంగా పవర్​ప్లేలో పొదుపుగా బౌలింగ్​ చేస్తూ.. మొత్తంగా 20 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే 15 ఏళ్ల ఐపీఎల్​ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో మొత్తం అన్ని మ్యాచ్​లు ఆడి.. ఒక్కసారి కూడా బ్యాటింగ్​కు రాలేదు షమి. టోర్నీలో ఇప్పటివరకు ఇలా జరగలేదు. దీంతో.. అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు గుజరాత్​ బౌలర్​. ఈ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ చాలా వరకు మ్యాచ్​లు ఆఖరి ఓవర్లో గెలిచింది. బ్యాటింగ్​లో నిలకడతో టెయిలెండర్లకు పెద్దగా బ్యాటింగ్​ చేసే అవకాశమే రాలేదు. ఈ క్రమంలోనే షమీకి ఈ ఘనత సాధ్యమైంది.
షమీని ఐపీఎల్​ మెగా వేలంలో రూ. 6.25 కోట్లకు దక్కించుకుంది టైటాన్స్​. తన మీద యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. 16 మ్యాచ్​ల్లో 20 వికెట్లతో ఆ జట్టు తరఫున టాప్​ బౌలర్​గా నిలిచాడు. ఎకానమీ కూడా 8 లోపే ఉండటం విశేషం. అంతేకాకుండా ఈ ఐపీఎల్​ తాను వేసిన మొదటి బంతికి, ఆఖరి బంతికి వికెట్​ తీయడం గమనార్హం. తొలి మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ను ఈ టోర్నీలో తాను వేసిన మొదటి బంతికే పెవిలియన్​ చేర్చాడు. ఫైనల్లో ఇన్నింగ్స్​ ఆఖరి బంతికి రియాన్​ పరాగ్​ను బౌల్డ్​ చేశాడు షమి.

ఇవీ చూడండి: బీసీసీఐ పెద్ద మనసు.. క్యురేటర్స్​, గ్రౌండ్స్​మెన్​కు ప్రైజ్​మనీ

రోహిత్​, కోహ్లీ లేకుండా.. సచిన్ ఐపీఎల్ 2022 సీజన్​ బెస్ట్ టీమ్​!

Last Updated : Jun 1, 2022, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.