IPL 2022 Mitchell Marsh: ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఏటా అత్యుత్తమ ప్రదర్శనలిచ్చే చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు వరుస మ్యాచుల్లో విఫలమవుతున్నాయి. అయితే గాయం కారణంగా ఈ మెగాలీగ్కు దూరమవుతాడనుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తిరిగి దిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి చేరాడు. శనివారం రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌తో ఈ లీగ్‌లోకి ప్రవేశించాడు మార్ష్.
గత రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ విఫలమయ్యాడు. 24 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. తాజాగా మార్ష్.. ఈ మెగా లీగ్‌లోకి అడుగుపెట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయస్కుడైన విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. అప్పటి నుంచి 12 ఏళ్ల కాలంలో కేవలం 22 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే ఇదే 12 ఏళ్లలో ఐదు ఫ్రాంచైజీలు మారాడు. అవే డెక్కన్ చార్జర్స్, పుణె వారియర్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, ఎస్‌ఆర్‌హెచ్, దిల్లీ క్యాపిటల్స్.
Mitchell Marsh Ipl Career: ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగావేలంలో మార్ష్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా, ఐపీఎల్ చరిత్రలో 21 మ్యాచులు ఆడిన మార్ష్ 225 పరుగులు సాధించాడు. మార్ష్.. ఆస్ట్రేలియా జట్టు తొలి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. గతేడాది ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36.88 సగటుతో 627 పరుగులు చేశాడు.
ఇవీ చదవండి: 'భారత్‌కు ప్రపంచకప్ అందించడమే నా లక్ష్యం'