ETV Bharat / sports

IPL 2022: గుజరాత్‌ జోరుకు బ్రేక్​.. పంజాబ్‌ ఘన విజయం - గుజరాత్‌

IPL 2022 Gujarat Vs Punjab: వరుస విజయాలతో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్​కు షాకిచ్చింది పంజాబ్ కింగ్స్. మంగళవారం జరిగిన మ్యాచ్​లో పాండ్య సేనపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2022
Gujarat Vs Punjab
author img

By

Published : May 3, 2022, 11:34 PM IST

IPL 2022 Gujarat Vs Punjab: అగ్రశ్రేణి జట్లను ఓడిస్తూ వరుస విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న గుజరాత్‌కు పంజాబ్‌ షాక్‌ ఇచ్చింది. మొదట బంతితో చెలరేగిన పంజాబ్‌.. అనంతరం బ్యాటింగ్‌లో సత్తా చాటి గుజరాత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో పాండ్య సేన వరుస 5 విజయాలకు బ్రేక్‌ పడింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శిఖర్‌ ధావన్‌ (62 నాటౌట్‌: 53 బంతుల్లో), భానుక రాజపక్స (40: 28 బంతుల్లో), లింగ్‌స్టోన్‌ (32 నాటౌట్‌: 10 బంతుల్లో) రాణించారు. 16వ ఓవర్లలో పంజాబ్‌ ఆటగాడు లివింగ్‌ స్టోన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా 6,6,6,4,2,4 పరుగులతో మొత్తం 28 పరుగులు రాబట్టాడు. దీంతో ఆ జట్టు 4 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

అంతకుముందు పంజాబ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల గుజరాత్‌ స్పల్ప స్కోరుకే పరిమితమైంది. సాయి సుదర్శన్ (64*) ఒంటరిపోరు చేయడం వల్ల గుజరాత్‌ 143 పరుగులు చేయగలిగింది. కగిసో రబాడ 4 వికెట్లతో రాణించాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌, రిషి ధవన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌ తలో వికెట్‌ తీశారు. శుభ్‌మన్ గిల్ (9), వృద్ధిమాన్‌ సాహా (21), హార్దిక్‌ పాండ్య (1), డేవిడ్ మిల్లర్ (11), పరుగులు చేయలేకపోయారు. ఫినిషర్‌గా మారిన రాహుల్ తెవాతియా (11) విఫలమయ్యాడు. రషీద్‌ ఖాన్‌ (0), ప్రదీప్‌ సాంగ్వాన్‌ (2), ఫెర్గుసన్‌ (5) స్వల్ప స్కోరుకే ఔటయ్యారు.

ఇదీ చూడండి: DRS For Wides: 'వైడ్ల నిర్ణయంపైనా డీఆర్‌ఎస్‌కు అవకాశం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.