ETV Bharat / sports

IPL 2021 News: 'ఐపీఎల్​ ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం' - ఢిల్లీ క్యాపిటల్స్​

ఐపీఎల్​-2021(IPL 2021 News) మొదటి దశలో ఉన్న ఉత్సాహాన్నే రెండో దశలోనూ జట్టుగా తాము కొనసాగిస్తామని అంటున్నాడు దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ రిషభ్​ పంత్​(Pant DC Captain). ఈ సారి తాము ట్రోఫీని గెలచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే క్వారంటైన్​ ముగించుకున్న పంత్​(Rishabh Pant News).. శనివారం నుంచి జట్టుతో కలిసి ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు.

IPL 2021: Trying to get used to the conditions, Saying Rishabh Pant
IPL 2021 News: 'ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం'
author img

By

Published : Sep 19, 2021, 8:09 AM IST

ఇంగ్లాండ్‌ నుంచి యూఏఈకి చేరుకున్న దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషభ్‌ పంత్(Delhi Capitals Captain).. ఆరు రోజుల క్వారంటైన్‌ ముగియడం వల్ల శనివారం జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సీజన్‌లో(IPL 2021 News) మొదటి దశలో చేసిన అద్భుతమైన ప్రదర్శనను రెండో దశలోనూ కొనసాగించాలనుకుంటున్నట్లు పంత్​(Rishabh Pant News) పేర్కొన్నాడు.

"క్వారంటైన్‌ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అందరిని కలవడం సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ సమయం బాల్కనీలో కూర్చున్నా. రెండు మూడు రోజుల్లో పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడతాను. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం మా అంతిమ లక్ష్యం. మేము రూపొందించుకున్న ప్రణాళికపై దృష్టిపెట్టబోతున్నాం. మొదటి దశలో చేసిన అద్భుత ప్రదర్శనను రెండో దశలోనూ కొనసాగిస్తామని ఆశిస్తున్నాం. ఈ సారి మేం ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది."

- రిషభ్​ పంత్​, దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​

బయోబుడగలో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల మే మొదటివారంలో ఐపీఎల్ అర్ధంతరంగా(IPL 2021 Postponed Date) వాయిదాపడింది. ఐపీఎల్‌ వాయిదాపడేనాటికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన దిల్లీ క్యాపిటల్స్‌.. ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్‌ రెండో దశలో సెప్టెంబరు 22న సన్ రైజర్స్‌ హైదరాబాద్‌తో(DC Vs SRH) తలపడనుంది.

ఇదీ చూడండి.. Team India Coach 2021: టీమ్​ఇండియా కొత్త కోచ్​ ఎవరు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.