ETV Bharat / sports

మా జట్టు బలం అదే.. కానీ: బౌల్ట్​

చివరి బంతి వరకు పోరాడటమే తమ జట్టు బలమని అన్నాడు ముంబయి ఇండియన్స్​ పేసర్​ ట్రెంట్​ బౌల్ట్​. తమ జట్టు మిడిల్ ​ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ మరింత బాగా ఆడాలని పరోక్షంగా సూచించాడు.

author img

By

Published : Apr 22, 2021, 2:58 PM IST

Updated : Apr 22, 2021, 4:43 PM IST

Boult
బౌల్ట్​

తమ జట్టు మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్ మరింత మెరుగవ్వాలని పరోక్షంగా సూచించాడు ముంబయి ఇండియన్స్​ పేసర్​ ట్రెంట్​ బౌల్ట్​. ​చివరి బంతి వరకు పోరాడటం తమ జట్టు బలమని అన్నాడు. ఆ పని ఇప్పటికే బౌలర్లు చేస్తున్నారని.. ఈ సీజన్​లో వారి ప్రదర్శనే ఇందుకు నిదర్శమని చెప్పాడు.

ఈ సీజన్​లో ఇప్పటివరకు ముంబయి నాలుగు మ్యాచ్​లు ఆడగా.. రెండింటింలో గెలిచింది. అయితే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ మిడిలార్డర్​ విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు బౌల్ట్​.

"ఇప్పటివరకు మ్యాచ్​లు సాగిన తీరుపై మిడిలార్డర్ సంతృప్తిగా లేదని నేను చెప్పగలను. పరుగులు చేసేందుకు వారు పట్టుదలతో ఉన్నారు. చెన్నైలో జరిగే చివరి మ్యాచ్​(పంజాబ్​పై)లో మంచి ప్రదర్శన చేయాలని అనుకుంటున్నారు. మేము మరిన్ని పరుగులు చేయాలి. చివరి బంతి వరకు పోరాడటం మా బలం. ఆ పని ఇప్పటికే బౌలర్లు చేస్తున్నారు. పంజాబ్​తో జరిగే మ్యాచ్​లో వారు అధిక పరుగులు చేస్తారని ఆశిస్తున్నా. అప్పుడే మ్యాచ్​ రసవత్తరంగా సాగుతుంది. తేమ పరిస్థితులు ఉన్నప్పుడు బౌలింగ్​ వేయడం కష్టంగా ఉంటుంది. కానీ దాన్ని సవాలుగా స్వీకరించి ఆ పరిస్థితులను అలవాటు చేసుకుంటున్నాం." అని బౌల్ట్​ అన్నాడు.

ముంబయి తన తర్వాతి మ్యాచ్​ను ఏప్రిల్​ 23 చెన్నై చిదంబరం స్డేడియంలో పంజాబ్​తో ఆడనుంది. దాని గురించి బౌల్ట్ మాట్లాడుతూ.. "పంజాబ్​ బ్యాట్స్​మన్​ ప్రమదకరమైన వారు. నేను సారథి కేఎల్​ రాహుల్​కు చాలా సార్లు బౌలింగ్​ వేశాను. అతడు ప్రపంచంలో ఉన్న క్లాస్​ బ్యాట్స్​మెన్​లో ఒకడు. యూనివర్స్​ బాస్​ క్రిస్​ గేల్​ను ఎదుర్కోవడం సవాల్​ లాంటిది" అని చెప్పాడు.

Last Updated : Apr 22, 2021, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.