ETV Bharat / sports

హైదరాబాద్​పై గెలిచినా... ప్లే ఆఫ్​ రేసు నుంచి ముంబయి ఔట్​ - ముంబయి ఇండియన్స్‌ విజయం

ఐపీఎల్​ 14 నుంచి ముంబయి ఇండియన్స్​ నిష్ర్కమించింది. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించలేక పోయింది.

Mumbai
ముంబయి
author img

By

Published : Oct 8, 2021, 11:35 PM IST

Updated : Oct 9, 2021, 11:48 AM IST

గత రెండు సీజన్లలోనూ ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌.. ఈసారి ప్లేఆఫ్స్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక రేసులో వెనుకబడ్డ ఆ జట్టు.. శుక్రవారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 42 పరుగుల తేడాతో నెగ్గింది. ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపు అసాధ్యమే అయినప్పటికీ.. బ్యాటింగ్‌లో ఆ జట్టు గట్టి ప్రయత్నమే చేసింది. ఇషాన్‌ కిషన్‌ (84; 32 బంతుల్లో 11×4, 4×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (82; 40 బంతుల్లో 13×4, 3×6) విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడటంతో మొదట ముంబయి 9 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. బాగా పరుగులిచ్చినప్పటికీ హోల్డర్‌ (4/52), రషీద్‌ ఖాన్‌ (2/40) కీలక వికెట్లు పడగొట్టారు. పార్ట్‌ టైం స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ (2/4) ఆకట్టుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు తిరిగి తుది జట్టులోకి రావడమే కాక, జట్టు పగ్గాలందుకున్న మనీష్‌ పాండే (69; 41 బంతుల్లో 7×4, 2×6) చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. జేసన్‌ రాయ్‌ (34; 21 బంతుల్లో 6×4), అభిషేక్‌ శర్మ (33; 16 బంతుల్లో 4×4, 1×6) కూడా సత్తా చాటారు. ముంబయి బౌలర్లలో బుమ్రా (2/39), నీషమ్‌ (2/28), కౌల్టర్‌నైల్‌ (2/40) రాణించారు. కిషన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ముంబయి ఏడో విజయంతో, సన్‌రైజర్స్‌ 11వ ఓటమితో టోర్నీని ముగించాయి. ఏడు విజయాలే సాధించినప్పటికీ.. నెట్‌ రన్‌రేట్‌లో ముంబయి (0.116) కన్నా మెరుగ్గా ఉన్న కోల్‌కతా (0.587) చివరి ప్లేఆఫ్‌ బెర్తును సొంతం చేసుకుంది.

ముందు కిషన్‌.. తర్వాత సూర్య: నెట్‌ రన్‌రేట్‌లో కోల్‌కతాను అధిగమించి ప్లేఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకోవాలంటే అత్యంత భారీ విజయం సాధించాల్సిన స్థితిలో.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి 250 పైచిలుకు స్కోరు లక్ష్యంతో చాలా దూకుడుగా బ్యాటింగ్‌ చేసింది. ముఖ్యంగా ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ అలా ఇలా ఆడలేదు. ప్రతి బంతినీ బౌండరీ దాటించాలన్నట్లుగా చెలరేగిన అతను.. కేవలం 16 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అందులో 44 పరుగులు బౌండరీల (8 ఫోర్లు, 2 సిక్సర్లు) ద్వారా వచ్చినవే. అతడి ధాటికి 5 ఓవర్లకే ముంబయి 78 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో రోహిత్‌ (18), హార్దిక్‌ (10) త్వరగా ఔటైపోయినా కిషన్‌ మాత్రం దూకుడు కొనసాగించాడు. దీంతో ముంబయి 7.1 ఓవర్లకే వంద దాటేసింది. కిషన్‌ జోరు చూస్తే ముంబయి 250 దాటడం ఖాయంగానే కనిపించింది. అయితే అతను ఔటయ్యాక స్కోరు వేగం పడిపోయింది. పొలార్డ్‌ (13) అనుకున్నంత వేగంగా ఆడలేక వెనుదిరిగాడు. మరోవైపు నీషమ్‌ (0), కృనాల్‌ (9) లాంటి హిట్టర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అయినా సరే.. ముంబయి 236 పరుగుల లక్ష్యాన్ని నిలపగలిగిందంటే అది సూర్యకుమార్‌ వల్లే. ఇన్నింగ్స్‌ ప్రథమార్ధంలో కిషన్‌ జోరు చూపిస్తే.. రెండో అర్ధంలో సూర్య రెచ్చిపోయాడు. అవతలి ఎండ్‌ నుంచి సహకారమే లేకున్నా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోరును 230 దాటించాడు. కిషన్‌, సూర్యల ధాటికి సన్‌రైజర్స్‌ బౌలర్లు కౌల్‌, హోల్డర్‌, ఉమ్రాన్‌ కలిసి 12 ఓవర్లలో ఏకంగా 156 పరుగులు సమర్పించుకున్నారు. హోల్డర్‌ పరుగులు బాగా ఇచ్చుకున్నప్పటికీ 4 వికెట్లు పడగొట్టడం విశేషం.

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) నబి (బి) రషీద్‌ 18; కిషన్‌ (సి) సాహా (బి) ఉమ్రాన్‌ 84; హార్దిక్‌ (సి) రాయ్‌ (బి) హోల్డర్‌ 10; పొలార్డ్‌ (సి) రాయ్‌ (బి) అభిషేక్‌ 13; సూర్యకుమార్‌ (సి) నబి (బి) హోల్డర్‌ 82; నీషమ్‌ (సి) నబి (బి) అభిషేక్‌ 0; కృనాల్‌ (సి) నబి (బి) రషీద్‌ 9; కౌల్టర్‌నైల్‌ (సి) నబి (బి) హోల్డర్‌ 3; చావ్లా (సి) సమద్‌ (బి) హోల్డర్‌ 0; బుమ్రా నాటౌట్‌ 5; బౌల్ట్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 235; వికెట్ల పతనం: 1-80, 2-113, 3-124, 4-151, 5-151, 6-184, 7-206, 8-230, 9-230

బౌలింగ్‌: నబి 3-0-33-0; సిద్దార్థ్‌ కౌల్‌ 4-0-56-0; హోల్డర్‌ 4-0-52-4; ఉమ్రాన్‌ మాలిక్‌ 4-0-48-1; రషీద్‌ ఖాన్‌ 4-0-40-2; అభిషేక్‌ శర్మ 1-0-4-2

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) పాండ్య (బి) బౌల్ట్‌ 34; అభిషేక్‌ (సి) కౌల్టర్‌నైల్‌ (బి) నీషమ్‌ 33; పాండే నాటౌట్‌ 69; నబి (సి) పొలార్డ్‌ (బి) చావ్లా 3; సమద్‌ (సి) పొలార్డ్‌ (బి) నీషమ్‌ 2; గార్గ్‌ (సి) హార్దిక్‌ (బి) బుమ్రా 29; హోల్డర్‌ (సి) బౌల్ట్‌ (బి) కౌల్టర్‌నైల్‌ 1; రషీద్‌ (సి) అండ్‌ (బి) బుమ్రా 9; సాహా (సి) అండ్‌ (బి) కౌల్టర్‌నైల్‌ 2; కౌల్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 193
వికెట్ల పతనం: 1-64, 2-79, 3-97, 4-100, 5-156, 6-166, 7-177, 8-182
బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-30-1; బుమ్రా 4-0-39-2; చావ్లా 4-0-38-1; కౌల్టర్‌నైల్‌ 4-0-40-2; నీషమ్‌ 3-0-28-2; కృనాల్‌ 1-0-16-0

Last Updated : Oct 9, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.