ETV Bharat / sports

ఐపీఎల్​ ఏర్పాట్లకు యూఏఈకి అధికారులు! - యూఏఈ

యూఏఈలో మిగిలిన ఐపీఎల్​ మ్యాచ్​ల నిర్వహణకు ఫ్రాంఛైజీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. క్రికెటర్ల ప్రయాణ, వసతి సౌకర్యాల ఏర్పాటుకు త్వరలోనే ఆ దేశానికి పయనమవనున్నాయి.

franchise officials to visit UAE
ఐపీఎల్ 2021
author img

By

Published : Jun 24, 2021, 3:51 PM IST

యూఏఈలో రెండో దశ ఐపీఎల్​- 14 నిర్వహణకు ఫ్రాంఛైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. క్రికెటర్ల ప్రయాణ, వసతి సౌకర్యాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు జులై 6 తర్వాత ఆ దేశానికి వెళ్లాలని భావిస్తున్నాయి. అందుకోసం ఇప్పటికే బీసీసీఐకి తెలపగా.. అనుమతులు రావడానికి కొంత సమయం పట్టనుందని ఓ ఫ్రాంఛైజీ అధికారి తెలిపారు.

కరోనా నేపథ్యంలో గతేడాది కూడా ఐపీఎల్​ యూఏఈలోనే జరగగా, ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని మరో అధికారి చెప్పారు. అందువల్ల బల్క్​ బుకింగ్స్​ సాధ్యం కాదని అన్నారు. కాగా, సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్​లను నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: IPL: మరో దెబ్బ.. ఐపీఎల్​కు ఆ మూడు దేశాల క్రికెటర్లు దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.