రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటింగ్‌లో అలరించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ పవర్‌ప్లేలోనే మూడు కీలకవికెట్లు కోల్పోయింది. బట్లర్ (8), మనన్ వోహ్రా (7), మిల్లర్ (0) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన కెప్టెన్ సంజూ శాంసన్ (21) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్.
తర్వాత రియాన్ పరాగ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాడు శివం దూబే. బౌండరీలతో పాటు వికెట్ల మధ్య అవసరమైన పరుగులు తీస్త్తూ జట్టు స్కోర్‌ను 100 దాటించాడు. తర్వాత పరాగ్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. కాసేపటి తర్వాత దూబే (46) కూడా అర్ధశతకం సాధించకుండానే వెనుదిరిగాడు. చివర్లో తెవాతియా 23 బంతుల్లో 40 పరుగులతో మెరుపులు మెరిపించడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది రాజస్థాన్.
బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హర్షల్ పటేల్ 3 వికెట్లతో సత్తాచాటగా.. జేమిసన్, రిచర్డ్సన్, సుందర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.