ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయ్ల్ఛాలెంజర్స్ బెంగళూరు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో బుమ్రా 3, బౌల్ట్, మిల్నే, చాహర్ తలో వికెట్ తీశారు. కోహ్లీ(51), గ్లెన్ మ్యాక్స్‌వెల్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే దేవదత్ పడిక్కల్(0) ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ అయ్యాడు. బుమ్రా వేసిన 1.4 బంతికి అతడు కీపర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్(32) సారథి కోహ్లీతో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే రాహుల్ చాహర్ వేసిన 8.5 ఓవర్‌కు అతడు ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 68పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న విరాట్‌ను ఆడమ్ మిల్నే అడ్డుకున్నాడు. దీంతో కోహ్లీ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్(56), ఏబీ డివిలియర్స్(11), అహ్మద్(1) ఔట్ అయ్యారు. మొత్తంగా ప్రత్యర్థి జట్టు ముందు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇదీ చూడండి: IPL 2021: టాస్ గెలిచిన ముంబయి.. ఆర్సీబీ బ్యాటింగ్