ఐపీఎల్లో తొలి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న బెంగళూరు.. రెండో మ్యాచ్‌లోనూ ఆ జోరు చూపించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌తో చెన్నై వేదికగా బుధవారం తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.
గత మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టి కృషితో ఆర్సీబీ విజయం దక్కించుకుంది. తొలిమ్యాచ్‌లో ఆడలేకపోయిన ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్.. ఈసారి తుదిజట్టులో ఉండే అవకాశముంది. కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ ఫామ్‌లో ఉండటం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. బౌలర్లలో హర్షల్ పటేల్‌తో పాటు మిగతా వారు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు కోల్‌కతాతో తొలిమ్యాచ్ ఓటమి నుంచి బయటపడి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. అందుకోసం కొత్త ప్రణాళికలతో బెంగళూరుతో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. తొలిపోరులో లోపాల్ని అధిగమించి ఇందులో రాణించాలని చూస్తోంది.
జట్లు(అంచనా)
హైదరాబాద్: వార్నర్(కెప్టెన్), బెయిర్‌స్టో, సాహా, మనీష్ పాండే, మహమ్మద్ నబీ, విజయ్ శంకర్, అబ్దుల్ సమాద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ.
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రజత్ పాటిదార్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, డేనియెల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్.