అహ్మదాబాద్ మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ కోహ్లీ (35), పాటిదార్ (31) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రర్ 3, రవి బిష్ణోయ్ 2, క్రిస్ జోర్డాన్, మెరిడిత్ తలా ఒక వికెట్ తీశారు.
180 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కోహ్లీసేన పూర్తిగా చేతులెత్తేసింది. జట్టు స్కోరు 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్సీబీ. తర్వాత పాటిదార్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రెండో వికెట్‌కు ఈ జంట 43 పరుగులు జోడించింది. 34 బంతుల్లో 35 పరుగులు చేసిన కోహ్లీని.. హర్‌ప్రీత్ బ్రర్ పెవిలియన్ పంపాడు. అనంతరం అదే పరుగుల వద్ద గ్లెన్ మ్యాక్స్‌వెల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఏ దశలోనూ బెంగళూరు కోలుకునేలా కనపడలేదు. క్రమంగా వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఏ ఒక్కరూ ఆకట్టుకోలేకపోయారు. దీంతో కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా లీగ్‌లో రెండో ఓటమి మూటగట్టుకుంది.
ఇవీ చదవండి: ఆపత్కాలంలో దేశానికి అండగా క్రికెటర్లు!