ఏ తల్లి అయినా తన కొడుకు గొప్ప ప్రయోజకుడు కావాలని కోరుకుంటుంది. అందుకోసం అహర్నిశలు కష్టపడుతుంది. ఆ కొడుకు ఏదైనా గొప్పపని చేసి ప్రజల మన్ననలు పొందితే ఆమెకు దక్కే ఆనందం అంతా ఇంతా కాదు. అచ్చం ఇలాంటి అనుభూతినే పొందుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తల్లి సరితా గైక్వాడ్(ruturaj gaikwad parents).
యూఏఈలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. అందులో రుతురాజ్(ruturaj gaikwad age) టాప్ స్కోరర్ (635)గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం అతడు పుణెలోని ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా చెన్నై ఓపెనర్‌కు ఘన స్వాగతం లభించింది.
-
Mersal Arasan 🔙 Home 💛#WhistlePodu #Yellove 🦁 @Ruutu1331 pic.twitter.com/SlOFnkvF9o
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mersal Arasan 🔙 Home 💛#WhistlePodu #Yellove 🦁 @Ruutu1331 pic.twitter.com/SlOFnkvF9o
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 17, 2021Mersal Arasan 🔙 Home 💛#WhistlePodu #Yellove 🦁 @Ruutu1331 pic.twitter.com/SlOFnkvF9o
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 17, 2021
ఈ సీజన్‌లో టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్(ruturaj gaikwad ipl) దాదాపు రెండు నెలల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడి తల్లి ఎంతో ప్రేమతో స్వాగతం పలికింది. ఇల్లంతా పూలతో అలంకరించి.. దిష్టితీసి మరీ ఇంట్లోకి ఆహ్వానించింది.
ఈ ఐపీఎల్‌లో(ipl 2021) రుతురాజ్ తన బ్యాటింగ్‌తో అదరగొట్టి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్(csk ipl win) ట్విటర్‌లో అభిమానులతో పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేసింది.
24 ఏళ్ల రుతురాజ్ ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 45.35 సగటుతో 7 అర్ధశతకాలు, ఒక శతకం బాదాడు. దీంతో 635 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకున్న పిన్న వయస్కుడిగా నిలిచాడు. మరోవైపు ఫైనల్లో కోల్‌కతాపై(csk vs kkr final) చెలరేగిన డుప్లెసిస్ (86) 633 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఇవీ చదవండి: