ఐపీఎల్-2021 సెకండ్ లెగ్‌లో పాల్గొనేందుకు దుబాయ్ పయయనమయ్యాడు చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. శుక్రవారం ఉదయం ధోనీతో సహా జట్టు ఆటగాళ్లంతా చెన్నై విమానాశ్రయం నుంచి యూఏఈకి బయల్దేరారు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం సోషల్‌మీడియాలో వెల్లడించింది.
-
✈️ Mode ON#UrsAnbudenEverywhere#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/yHE4c2Qk4X
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">✈️ Mode ON#UrsAnbudenEverywhere#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/yHE4c2Qk4X
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 13, 2021✈️ Mode ON#UrsAnbudenEverywhere#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/yHE4c2Qk4X
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 13, 2021
గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఈ మెగా లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2021లో మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు జరగనున్నాయి.
అయితే శుక్రవారం ఉదయం డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లూ యూఏఈ బయల్దేరారు. ఐపీఎల్ సెకండ్ లెగ్‌లోని తొలి మ్యాచ్‌లో చెన్నై, ముంబయి జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇదీ చూడండి.. లండన్‌తో రాహుల్ లవ్ అఫైర్.. సెంచరీలతో జోరు!