ETV Bharat / sports

Kolkata Knight Riders: యూఏఈలోనే కోల్‌'కథ' మలుపు తిరిగింది!

తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఐదు అపజయాలు.. రెండు విజయాలు.. ఇంకేముంది ఆ జట్టు పనైపోయింది.. ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టమే అని అంతా భావించారు. కానీ, కరోనా కారణంగా మ్యాచ్‌లు యూఏఈకి తరలడం వల్ల ఆ జట్టు దశ తిరిగింది. రెండో దశలో 'ఉప్పెన'లా ఎగిసిపడి ప్లే ఆఫ్స్‌లో(IPL 2021 KKR latest news) అడుగేసింది. 'తగ్గేదేలే' అంటూ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీని ఓడించి క్వాలిఫయర్-2కి దూసుకెళ్లింది. ఇదంతా ఏ జట్టు గురించి అనుకుంటున్నారా.. అదేనండి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గురించి. ఈ జట్టు వరుస ఓటముల నుంచి తేరుకుని క్వాలిఫయర్‌-2 వరకు ఎలా వచ్చిందో ఓసారి తెలుసుకుందాం..

ipl 2021 update
ఐపీఎల్ 2021 తాజా వార్తలు
author img

By

Published : Oct 13, 2021, 5:32 AM IST

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారత్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో అదృష్టం (ipl 2021 kkr latest news) కలిసిరాలేదనే చెప్పాలి. ఎందుకుంటే భారత్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్‌.. రెండు విజయాలు మాత్రమే సాధించింది. మోర్గాన్‌ సేన.. ఈ సీజన్‌ని విజయంతో ఆరంభించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్‌ రాణా(80 పరుగులు) రాణించడంతో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తర్వాత కేకేఆర్‌కు కాలం కలిసిరాలేదు. ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు,చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో వరుసగా ఓటములపాలైంది. తర్వాత పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన పోరులో నెగ్గినా.. దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో కంగుతింది. అనంతరం బయోబుడగలో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్‌ వాయిదాపడింది.

యూఏఈలో కోల్‌'కథ'మలుపు తిరిగింది

కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు యూఏఈకి మారడం కేకేఆర్‌కు బాగా కలిసొచ్చింది. యూఏఈలో ఏడు లీగ్‌ మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఐదింటిలో విజయం సాధించింది. రెండో దశను మోర్గాన్‌ సేన భారీ విజయంతో ఆరంభించింది. ఆర్‌సీబీని 92 పరుగులకే ఆలౌట్‌ చేసి 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తర్వాత బలమైన ముంబయి ఇండియన్స్‌ని మట్టకరిపించింది. చెన్నై సూపర్‌ కింగ్స్ చేతిలో ఓటమిపాలైనా.. అనంతరం దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్ జట్లను ఓడించి ప్లే ఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. తర్వాత సన్‌రైజర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుని 115 పరుగులకే కట్టడి చేసినా.. లక్ష్యాన్ని ఛేదించేందుకు కోల్‌కతా చెమటోడ్చింది. నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. లీగ్‌ దశ ముగిసేసరికి ముంబయి ఇండియన్స్‌ కూడా 14 పాయింట్లు సాధించింది. కానీ, మెరుగైన రన్‌రేట్‌ ఉన్న కారణంగా కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కి చేరింది.

నరైన్‌ స్పిన్ మయాజాలం.. క్వాలిఫయర్‌-2కి కోల్‌కతా..

ipl 2021 update
నరైన్‌ స్పిన్ మయాజాలం.. క్వాలిఫయర్‌-2కి కోల్‌కతా..

ఆర్‌సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. విరాట్ కోహ్లి, శ్రీకర్‌ భరత్, మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్‌లను ఔట్‌చేయడమే కాకుండా 15 బంతుల్లో 26 పరుగులు చేసి కోల్‌కతా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన కోల్‌కతా క్వాలిఫయర్-2కి దూసుకెళ్లింది. ఫైనల్స్‌లో బెర్తు కోసం దిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

జట్టు విజయాల్లో అతడిదే కీలకపాత్ర

ipl 2021 update
జట్టు విజయాల్లో అతడిదే కీలకపాత్ర

మొదటి దశలో కోల్‌కతా రెండే విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ రేసులో వెనుకబడింది. దీంతో రెండో దశలో కేకేఆర్‌ జట్టులో పలు మార్పులు చేసింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ని తుది జట్టులోకి తీసుకుంది. ఇతడు నిలకడగా పరుగులు సాధిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 265 పరుగులు చేశాడు వెంకటేశ్‌ అయ్యర్‌. ఆర్‌సీబీతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 41 పరుగులు చేసి అదరగొట్టాడు. తర్వాత ముంబయి ఇండియన్స్‌పై అర్ధశతకం(53) బాదాడు. పంజాబ్‌ కింగ్స్‌పై 67 పరుగులు చేసి సత్తా చాటాడు. రాజస్థాన్‌ రాయల్స్‌పై (38), ఆర్‌సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో (26) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.

ఇదీ చదవండి: T20 World Cup 2021: నిన్న ఉమ్రాన్​ మాలిక్​.. నేడు ఆవేశ్​ ఖాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.