క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021.. 14వ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు వేదికలు, మ్యాచ్‌ల తేదీలు ఖరారు చేస్తూ బీసీసీఐ ఆదివారం ప్రకటన చేసింది. మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి.. అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాలను వేదికలుగా ఎంపిక చేసింది.
ఏప్రిల్ 9న చెన్నై వేదికగా.. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, మే 30న మొతేరా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అలాగే ఫ్లేఆఫ్స్ కూడా మొతేరా స్టేడియంలో నిర్వహిస్తుండటం గమనార్హం.
టోర్నీ మొదవ్వడానికి మరో నెల రోజుల సమయమే ఉండడం వల్ల ఆటగాళ్లతో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ఫ్రాంచైజీలు చకచకా ఏర్పాట్లు చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ఏ ఫ్రాంచైజీలో ఏ ఆటగాడు ఆడనున్నారో తెలుసుకుందాం.
2021 ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండే ఎనిమిది జట్లలోని ఆటగాళ్లు వీరే..
పంజాబ్ కింగ్స్ జట్టు:
కేఎల్ రాహుల్(కెప్టెన్&వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మన్దీప్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బ్రార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ పోరెల్, దర్శన్ నల్కండే, క్రిస్ జోర్డాన్.
ఇటీవల జరిగిన వేలంతో జట్టులో చేరే ఆటగాళ్లు..
డేవిడ్ మలన్(రూ.1.5 కోట్లు), జే రిచర్డ్సన్(రూ.14 కోట్లు), షారుక్ ఖాన్(రూ.5.25 కోట్లు), రిలే మెరిడిత్(రూ.8 కోట్లు), మొయిసెస్ హెన్రిక్స్(రూ.4.2 కోట్లు), జలజ్ సక్సేనా(రూ.30 లక్షలు), ఉత్కర్ష్ సింగ్(రూ.20 లక్షలు), ఫాబియన్ అలెన్(రూ.75 లక్షలు), సౌరభ్ కుమార్(రూ.20 లక్షలు).
రాజస్థాన్ రాయల్స్ జట్టు:
సంజు శాంసన్(కెప్టెన్&వికెట్ కీపర్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, యశస్వి జైస్వాల్, మనన్ వోహ్ర, అనుజ్ రావత్, రియాన్ పరాగ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, మహిపాల్ లామ్రర్, శ్రేయస్ గోపాల్, మయాంక్ మార్కండే, జోఫ్రా ఆర్చర్, ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి.
ఇటీవల జరిగిన వేలంతో జట్టులో చేరే ఆటగాళ్లు..
శివం దూబే(రూ.4.4 కోట్లు), క్రిస్ మోరిస్(రూ.16.25 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్(రూ.1 కోటి), చేతన్ సకారియా(రూ.1.20 కోట్లు), కేసీ కరియప్ప(రూ.20 లక్షలు), లియమ్ లివింగ్‌స్టోన్(రూ.75 లక్షలు), కుల్దీప్ యాదవ్(రూ.20 లక్షలు), ఆకాశ్ సింగ్(రూ.20 లక్షలు).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జోస్ ఫిలిప్(వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), పవన్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, డానియల్ సామ్స్, యజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, షాబాద్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, కేన్ రిచర్డ్సన్, హర్షల్ పటేల్.
ఇటీవల జరిగిన వేలంతో జట్టులో చేరే ఆటగాళ్లు..
గ్లెన్ మ్యాక్స్‌వెల్(రూ.14.25 కోట్లు), సచిన్ బేబి(రూ.20 లక్షలు), రజత్ పాటిదార్(రూ.20 లక్షలు), మహ్మద్ అజారుద్దీన్(రూ.20 లక్షలు), కైల్ జేమిసన్(రూ.15 కోట్లు), డానియల్ క్రిస్టియన్(రూ.4.8 కోట్లు), సుయాష్ ప్రభుదేశాయ్(రూ.20 లక్షలు), కేఎస్ భరత్(రూ.20 లక్షలు).
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్(వికెట్ కీపర్), రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ(కెప్టెన్&వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రేవో, కరణ్ శర్మ, ఆర్ సాయి కిశోర్, మిచెల్ శాంటర్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, జోష్ హేజిల్‌వుడ్, కేఎమ్ ఆసిఫ్.
ఇటీవల జరిగిన వేలంతో జట్టులో చేరే ఆటగాళ్లు..
మొయిన్ అలీ(రూ.7 కోట్లు), కే గౌతమ్(రూ.9.25 కోట్లు), ఛెతేశ్వర్ పుజారా(రూ.50 లక్షలు), ఎమ్ హరిశంకర్ రెడ్డి(రూ.20 లక్షలు), కే భగత్ వర్మ(రూ.20 లక్షలు), సీ హరి నిషాంత్(రూ.20 లక్షలు).
ముంబయి ఇండియన్స్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, అన్మోల్ప్రీత్ సింగ్, ఆదిత్య ఠారే(వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, అనుకుల్ రాయ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ధవల్ కులకర్ణి, మోహిసిన్ ఖాన్.
ఇటీవల జరిగిన వేలంతో జట్టులో చేరే ఆటగాళ్లు..
ఆడమ్ మిల్నే(రూ.3.20 కోట్లు), నాథన్ కౌల్టర్‌నైల్(రూ.5 కోట్లు), పీయూష్ చావ్లా(రూ.2.4 కోట్లు), జేమ్స్ నీషమ్(రూ.50 లక్షలు), యుధ్వీర్ చరక్(రూ.20 లక్షలు), మాక్రో జాన్సన్(రూ.20 లక్షలు), అర్జున్ తెందూల్కర్(రూ.20 లక్షలు).
దిల్లీ క్యాపిటల్స్ జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీ షా, ఆజింక్య రహానె, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శిమ్రాన్ హెట్మెయిర్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అమిత్ షా, లలిత్ యాదవ్, ప్రవీణ్ దుబే, కసిగో రబాడా, ఆన్రిచ్ నోర్త్జే, ఇషాంత్ శర్మ, అవేష్ ఖాన్.
ఇటీవల జరిగిన వేలంతో జట్టులో చేరే ఆటగాళ్లు..
స్టీవ్ స్మిత్(రూ.2.20 కోట్లు), ఉమేశ్ యాదవ్(రూ.1 కోటి), రిపల్ పటేల్(రూ.20 లక్షలు), విష్ణు వినోద్(రూ.20 లక్షలు), లుక్మాన్ మెరివాలా(రూ.20 లక్షలు), ఎం సిద్ధార్థ్(రూ.20 లక్షలు), టామ్ కర్రన్(రూ.5.25 కోట్లు), సామ్ బిల్లింగ్స్(రూ.2 కోట్లు).
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
డేవిడ్ వార్నర్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), మనీశ్ పాండే, శ్రీవాస్తవ్ గోస్వామి(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, విరాట్ సింగ్, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్ధ్ కౌల్, బాసిల్ తంపి.
ఇటీవల జరిగిన వేలంతో జట్టులో చేరే ఆటగాళ్లు..
జగదీష్ సుచిత్(రూ.30 లక్షలు), కేదార్ జాదవ్(రూ.2 కోట్లు), ముజీబ్ ఉర్ రెహ్మాన్(రూ.1.5 కోట్లు),
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు:
శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, టిమ్ సీఫర్ట్, రాహుల్ త్రిపాఠి, రింకు సింగ్, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రసెల్, సనీల్ నరైన్, వరుణ్ సి.వి., కుల్దీప్ యాదవ్, ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్, కమ్లేష్ నాగర్‌కోటీ, శివమ్ మవీ, సందీప్ వారియర్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇటీవల జరిగిన వేలంతో జట్టులో చేరే ఆటగాళ్లు..
షకిబుల్ హసన్(రూ.3.20కోట్లు), షెల్డన్ జాక్సన్(రూ.20లక్షలు), వైభవ్ అరోరా(రూ.20లక్షలు), కరుణ్ నాయర్(రూ.50లక్షలు), హర్భజన్ సింగ్(రూ.2 కోట్లు), బెన్ కటింగ్(రూ.75లక్షలు), వెంకటేశ్ అయ్యర్(రూ.20లక్షలు), పవన్ నేగి(రూ.50లక్షలు).
ఇదీ చూడండి: ముంబయి X ఆర్సీబీ పోరుతో ఏప్రిల్ 9న ఐపీఎల్ షురూ