ETV Bharat / sports

ఆర్సీబీని నా కుటుంబంలా భావిస్తా: మ్యాక్స్​వెల్​ - kohli maxwell

బెంగళూరు జట్టును తన సొంత ఇంటిలా భావిస్తున్నానని మ్యాక్స్​వెల్ చెప్పాడు. విరాట్ కోహ్లీ గొప్ప సారథి అని ప్రశంసించాడు. ఈ సీజన్​లో బ్యాటింగ్​తో ఆకట్టుకుంటున్న మ్యాక్సీ.. ప్రతి మ్యాచ్​లోనూ అదరగొడుతున్నాడు.

Maxwell
మ్యాక్స్​వెల్​
author img

By

Published : Apr 22, 2021, 11:05 AM IST

Updated : Apr 22, 2021, 12:03 PM IST

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఫ్రాంచైజీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఆ జట్టుకు ఆడుతున్న ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​. ఈసారి ఐపీఎల్​ కోసం భారతదేశానికి వచ్చిన తొలి రోజు నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీని తన సొంత ఇంటిలా భావిస్తానని అన్నాడు.

ఐపీఎల్​లో కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేస్తన్న మ్యాక్స్​వెల్​.. ప్రస్తుత సీజన్​లో బాగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల్లో కలిపి 176 పరుగులు చేశాడు. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్​లో నేడు(గురువారం) రాజస్థాన్​ రాయల్స్​తో తలపడనుంది. ముంబయి వాంఖడే స్డేడియం వేదికగా ఈ పోరు జరగనుంది.

"వాంఖడేలో పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఈ సీజన్​లో ఈ మైదానం వేదికగా ఇప్పటివకు మంచి స్కోర్లు నమోదయ్యాయి. మా బ్యాటింగ్​ దళం బలంగా ఇకపై కూడా ఇలానే కొనసాగిస్తే ఆసక్తికరంగా ఉంటుంది" అని మ్యాక్స్​వెల్ చెప్పాడు. అలానే కోహ్లీ గొప్ప సారథి అని కితాబిచ్చాడు.

Last Updated : Apr 22, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.