రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌లో మెరిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఫలితంగా రాజస్థాన్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్ ధాటిగా ఆరంభించాడు. 17 బంతుల్లోనే 33 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ (10) మరోసారి నిరాశపర్చాడు. మొయిన్ అలీ (26), రైనా (18), రాయుడు (27) మెరుపులు మెరిపించినా తొందరగానే ఔటయ్యారు. జడేజా (8), ధోనీ (18), సామ్ కరన్ (13) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివర్లో బ్రావో (20) దంచికొట్టడం వల్ల సీఎస్కే 188 పరుగులు చేయగలిగింది.