సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి డేవిడ్ వార్నర్‌ను (Warner SRH) తప్పించడానికి అతడి ఫామ్ లేమి మాత్రమే కారణం కాదని అన్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్. (SRH David Warner Dropped)అంతకుమించి ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశాడు.
సెప్టెంబర్ 27న రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా వార్నర్‌ను పక్కనపెట్టింది సన్‌రైజర్స్ (Warner SRH News). ఆ మ్యాచ్‌ను అతడు హోటల్ గది నుంచే తిలకించాడు. అనంతరం ఆదివారం (అక్టోబర్ 4) కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడికి జట్టులో (SRH Squad 2021) చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌ను అతడు స్టాండ్స్‌లో కూర్చోని చూస్తూ సన్‌రైజర్స్‌కు మద్దతు తెలిపాడు. రెండింటిలోనూ హైదరాబాద్ ఓటమి చవిచూసింది.
"సన్‌రైజర్స్ తుది జట్టు నుంచి వార్నర్‌ను తప్పించడానికి క్రికెటేతర కారణం అయ్యుండొచ్చు. ఎందుకంటే కొన్నేళ్లుగా అతడి ప్రదర్శన మహాద్భుతం. ఐపీఎల్ చరిత్రలోనే అతడో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. అతడి ఫామ్ లేమి కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. కాబట్టి క్రికెట్ కారణం కాదు. అదేంటో నాకూ తెలియదు. కానీ, ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తోంది."
- సంజయ్ మంజ్రేకర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
గతంలో (Warner IPL Records) తన స్థాయికి తగిన ప్రదర్శనకు భిన్నంగా ఈ సీజన్లో (IPL 2021) ఆడిన 8 మ్యాచుల్లో కేవలం 195 పరుగులే చేశాడు వార్నర్. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై తాను సన్‌రైజర్స్‌కు (Warner SRH) ఆడకపోవచ్చేమో అని కూడా వ్యాఖ్యానించాడు.
ఇదీ చూడండి: వార్నర్ వచ్చాడు.. ఫ్యాన్స్‌లో జోష్ తెచ్చాడు