ETV Bharat / sports

ఐపీఎల్​: రాజస్థాన్​ను చెన్నై నిలువరించేనా?

ముంబయి వాంఖడే మైదానంలో​ చెన్నై సూపర్ కింగ్స్​-రాజస్థాన్ రాయల్స్​ మధ్య సోమవారం మ్యాచ్ జరగనుంది. ​రాత్రి 7.30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

csk vs rr, csk vs rr match preview
రాజస్థాన్ vs చెన్నై, ధోనీ, శాంసన్
author img

By

Published : Apr 19, 2021, 6:04 AM IST

ఐపీఎల్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్​, రాజస్థాన్ రాయల్స్​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఇప్పటికే చెరో రెండు మ్యాచ్​లు ఆడిన ఇరుజట్లు తలా ఒక విజయంతో ఊపుమీదున్నాయి. ఈ మ్యాచ్​లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందడుగు వేయాలని భావిస్తున్నాయి.

రాజస్థాన్​కు తిరుగుందా?

పంజాబ్​తో ఆడిన తొలి మ్యాచ్​లోనే భారీ లక్ష్యాన్ని ఛేదించేటట్లు కనిపించిన శాంసన్​ సేన స్వల్ప తేడాతో ఓడిపోయింది. దిల్లీతో రెండో మ్యాచ్​లో విజయం సాధించి ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంది. మొదటి మ్యాచ్​లో సెంచరీ హీరో, కెప్టెన్ సంజూ శాంసన్​, డేవిడ్ మిల్లర్​, క్రిస్ మోరిస్, శివం దూబే రాణిస్తున్నప్పటికీ.. నిలకడలేమి రాజస్థాన్​ బ్యాటింగ్​ను ఇబ్బంది పెడుతోంది.

బౌలింగ్​లో యువ ఆటగాడు చేతన్ సకారియా, ఆల్​రౌండర్​ మోరిస్, ఉనద్కత్, రెహామాన్​ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్నారు. స్పిన్నర్లు పరాగ్, తెవాతియా విజృంభిస్తే రాజస్థాన్​కు మరో విజయం ఖాయమే!

ఇదీ చదవండి: స్విమ్మింగ్​లో శ్రీహరి నటరాజ్​ సరికొత్త రికార్డు

చెన్నై నెగ్గుతుందా?

ఐపీఎల్​లో మరో విజయవంతమైన జట్టు చెన్నై. గతేడాది మాత్రం విఫలమైన ధోనీసేన.. ఈసారి తన పవర్​ చూపించాలని భావిస్తోంది. దిల్లీతో తొలి మ్యాచ్​లో ఓడినప్పటికీ, పంజాబ్​తో రెండో మ్యాచ్​లో ప్రత్యర్థిని స్వల్ప పరుగులకే కట్టడి చేసి, విజయం సాధించింది. మరి రాజస్థాన్​తో మ్యాచ్​లో ఏం చేస్తుందో చూడాలి?

బ్యాటింగ్​లో సురేశ్ రైనా, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, డుప్లెసిస్ ఫర్వాలేదనిపిస్తున్నారు. కెప్టెన్ ధోనీ ఏడో స్థానంలో రావడం జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అంబటి రాయుడు, రుతురాజ్​ గైక్వాడ్​, బ్రేవో రాణిస్తే.. చెన్నైకి తిరుగుండదు.

బౌలింగ్​లో దీపక్ చాహర్​, శార్దుల్ ఠాకుర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్నారు. ఆల్​రౌండర్​ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్​ కరన్​ విజృంభించాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: బెంగళూరు హ్యాట్రిక్ విన్​.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.