ETV Bharat / sports

సీఎస్కే కోచ్ మైఖేల్ హస్సీకి కరోనా! - మైఖేల్ హస్సీ కొవిడ్ 19 పాజిటివ్

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి కరోనా పాజటివ్​గా నిర్దరణ అయింది. అయితే అతడి శాంపిల్​ను రీటెస్టుకు పంపించామని.. ఆ ఫలితం వచ్చాకనే అధికారిక ప్రకటన చేస్తామని ఫ్రాంచైజీ తెలిపింది.

Hussey
మైఖేల్ హస్సీ
author img

By

Published : May 4, 2021, 9:44 PM IST

ఐపీఎల్​లో కరోనా కలకలం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడగా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అయితే శాంపిల్​ను రీటెస్టు కోసం పంపించామని.. ఆ ఫలితం వచ్చాకే అధికారిక ప్రకటన చేస్తామని సీఎస్కే ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే ఈ జట్టు బౌలింగ్ కోచ్ బాలాజీ, బస్ క్లీనర్​కు పాజిటివ్​ రాగా వారు ఐసోలేషన్​కు వెళ్లారు.

కరోనా కారణంగా ఐపీఎల్​ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. మ్యాచ్​లు సజావుగా సాగుతున్న తరుణంలో కేకేఆర్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్​కు కరోనా సోకింది. అలాగే సన్​రైజర్స్ కీపర్ సాహా, దిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో ఆందోళన చెందిన నిర్వాహకులు.. ఆటగాళ్ల రక్షణ దృష్ట్యా లీగ్​ను వాయిదా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.