అహ్మదాబాద్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. గత మ్యాచ్‌ల్లో రాణించిన దిల్లీ ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ జట్టుకు ఓపెనర్లు తొలి వికెట్‌కు 23 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఈ జంటను తొలుత జేమీసన్ దెబ్బ కొట్టాడు. 6 రన్స్ చేసిన ధావన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే స్టీవ్ స్మిత్‌ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. గత మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన పృథ్వీ షా వికెట్‌ను హర్షల్ పటేల్ తీసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టోయినిస్.. కెప్టెన్ పంత్‌కు సహకరించాడు. ఈ జంట నాలుగో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. కుదురుకుంటుందనుకున్న సమయంలోనే దిల్లీని హర్షల్ పటేల్ మరోసారి దెబ్బకొట్టాడు. స్టోయినిస్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
చివర్లో పంత్ (58)తో కలిసి హెట్మెయర్ (53) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సి ఉండగా ఫోర్ మాత్రమే లభించడం వల్ల విజయం ఆర్సీబీ కైవసమైంది.
ఇవీ చదవండి: బంతికి ఉమ్ము రుద్దిన మిశ్రా.. అంపైర్ వార్నింగ్